Breaking News

ఫిబ్రవరి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఎవరం‍టే..?

Published on Mon, 03/13/2023 - 15:03

ICC Player Of The Month: 2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఐసీసీ ఇవాళ (మార్చి 13) ప్రకటిం‍చింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్‌ అప్‌కమింగ్‌ స్టార్‌ హ్యారీ బ్రూక్‌ గెలుచుకున్నాడు. 3 నెలల వ్యవధిలో బ్రూక్‌ ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2022 డిసెంబర్‌లోనూ బ్రూక్‌ ఈ అవార్డును గెలుచుకున్నాడు.

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ తర్వాత ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్‌ మాత్రమే కావడం విశేషం. బాబర్‌ 2021 ఏప్రిల్‌లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2023, ఫిబ్రవరిలో బ్రూక్‌కు పోటీగా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, విండీస్‌ యువ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ పోటీపడినప్పటికీ, అంతిమంగా అవార్డు బ్రూక్‌నే వరించింది. 

బ్రూక్‌.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.  విండీస్‌ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ విషయానికొస్తే.. ఇండియన్‌ ఆరిజిన్‌ కలిగిన ఈ స్పిన్‌ బౌలర్‌ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్‌కు ఓటింగ్‌ శాతం అధికంగా రావడంతో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ఫిబ్రవరి మంత్‌ అవార్డుకు అతన్నే ఎంపిక చేసింది. 

ఇక మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ఫిబ్రవరి మంత్‌ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్‌నర్‌ ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం​ దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్‌, ఇంగ్లండ్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ పోటీపడినప్పటికీ, గార్డ్‌నర్‌నే అవార్డు వరించింది. బ్రూక్‌, బాబర్‌ తరహాలోనే గార్డ్‌నర్‌ కూడా ప్లేయర్‌ అఫ్‌ ద మంత్‌ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది. 2022 డిసెంబర్‌లో తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన గార్డ్‌నర్‌, 2023 ఫిబ్రవరిలో రెండో సారి ఐసీసీ అవార్డను గెలుచుకుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)