Breaking News

ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో సూర్యకుమార్‌, యశస్వి జైస్వాల్‌

Published on Wed, 01/03/2024 - 17:52

ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డులైన మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (2023), మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (2023) రేసులో ఇద్దరు టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు నిలిచారు. మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌.. మెన్స్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు నామినీస్‌ జాబితాలో యశస్వి జైస్వాల్‌ ఉన్నారు.

టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు రేసులో స్కైతో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్‌ ఆటగాడు మార్క్‌ చాప్‌మన్‌, ఉగాండ ఆటగాడు అల్పేశ్‌ రామ్‌జనీ ఉండగా.. ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులో యశస్వితో పాటు న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ, శ్రీలంక పేసర్‌ దిల్షన్‌ మధుషంక నిలిచారు. గతేడాది ప్రదర్శన ఆధారంగా ఐసీసీ ఆయా ఆటగాళ్లను నామినేట్‌ చేసింది. 

2023 టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ (17 ఇన్నింగ్స్‌ల్లో 48.86 సగటున 155.95 స్ట్రయిక్‌రేట్‌తో 733 పరుగులు)

2023 టీ20ల్లో సికందర్‌ రజా (11 ఇన్నింగ్స్‌ల్లో 51.50 సగటున 150.14 స్ట్రయిక్‌రేట్‌తో 515 పరుగులు), బౌలింగ్‌లో 14.88 సగటున 6.57 ఎకానమీతో 17 వికెట్లు

2023 టీ20ల్లో అల్పేశ్‌ రామ్‌జనీ (30 మ్యాచ్‌ల్లో 8.98 సగటున 4.77 ఎకానమీతో 55 వికెట్లు)

2023 టీ20ల్లో మార్క్‌ చాప్‌మన్‌ (17 ఇన్నింగ్స్‌ల్లో 50.54 సగటున 145.54 స్ట్రయిక్‌రేట్‌తో 556 పరుగులు)

ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీస్‌ విషయానికొస్తే.. రచిన్‌ రవీంద్ర (10 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో  578 పరుగులు, 7 వికెట్లు), గెరాల్డ్‌ కొయెట్జీ (8 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు), దిల్షన్‌ మధుషంక (9 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు) వన్డే వరల్డ్‌కప్‌ 2023లో అద్భుత ప్రదర్శనల కారణంగా ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. యశస్వి జైస్వాల్‌ (4 టెస్ట్‌లు, 15 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 718 పరుగులు) అయితే ఫార్మాట్లకతీతంగా ఇరగదీసి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. 
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)