Breaking News

ICC: హెల్మెట్‌ కచ్చితం.. ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్‌ తీసిన పరుగులు?

Published on Tue, 05/16/2023 - 08:23

ICC Announces New Rules- దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తరుచూ వివాదాస్పదమవుతున్న నిర్ణయాలను సవరించింది. సాఫ్ట్‌ సిగ్నల్, ఫ్రీ హిట్‌కు బౌల్డయితే పరుగులపై స్పష్టతనిచ్చింది. పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనే బ్యాటర్‌ తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందే! ఇకపై తన ఇష్టానికి వదిలేయరు. ఇది ఐసీసీ కొత్త రూల్‌!  

సాఫ్ట్‌ సిగ్నల్‌: సాధారణంగా క్యాచ్‌లు పట్టినపుడు తీసుకునే నిర్ణయాలు. బౌండరీకి దగ్గరో, లేదంటే బంతి నేలను తాకినట్లు పట్టిన క్యాచ్‌లు వివాదాస్పదమవుతాయి. ఫీల్డ్‌ అంపైర్‌ తొలుత అవుటిచ్చినా... దాన్ని మళ్లీ టీవీ (థర్డ్‌) అంపైర్‌కు నివేదిస్తారు.

కానీ మళ్లీ సాఫ్ట్‌ సిగ్నల్‌’ ప్రకారం అవుటనే ప్రకటిస్తారు. ఇప్పుడు ‘సాఫ్ట్‌’కు కాలం చెల్లింది. టీవీ అంపైర్‌దే తుది నిర్ణయమవుతుంది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌కు ఇది మరో కోతలాంటిది! 

ఫ్రీ హిట్‌కు బౌల్డయితే:
ఫ్రీ హిట్‌కు బౌల్డయితే బ్యాటర్‌ తీసిన పరుగులు చట్టబద్ధమే! ఇందులో ఎలాంటి వివాదానికి తావులేదని ఐసీసీ కమిటీ ప్రకటించింది. అయితే ఇలా తీసిన పరుగులు ఎక్స్‌ట్రాల కోటలో జమకావు. బ్యాటర్స్‌ ఖాతాలోకి వెళ్తాయి.

గత టి20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఫ్రీ హిట్‌కు బౌల్డయి మూడు పరుగులు రాబట్టాడు. పాక్‌ క్రికెటర్లు గగ్గోలు పెడితే అంపైర్లు నియమావళిని వివరించినా... చాన్నాళ్లు దీనిపై చర్చ నడిచింది! 

హెల్మెట్‌ ఐచ్చికం కాదు... కచ్చితం:
పేసర్లు బౌలింగ్‌కు దిగితే బ్యాటర్లు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందే. అలాగే బ్యాటర్లకు చేరువగా మోహరించిన ఫీల్డర్లు సైతం హెల్మెట్‌ పెట్టుకోవాలి.    

చదవండి: వారెవ్వా భువీ.. 2 పరుగులు, 4 వికెట్లు! వీడియో వైరల్‌
టైటాన్స్‌ క్వాలిఫై... సన్‌రైజర్స్‌ అవుట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)