Breaking News

వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటనకు ముహూర్తం ఖరారు..!

Published on Thu, 06/22/2023 - 15:08

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ ప్రకటనను ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల (జూన్‌) 27న షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ఐసీసీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వరల్డ్‌కప్‌ ప్రారంభ తేదీ అయిన అక్టోబర్‌ 5కు జూన్‌ 27 సరిగ్గా 100 రోజులు ముందుండంతో ఐసీసీ ఈ తేదీన షెడ్యూల్‌ విడుదల చేసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 

కాగా, బీసీసీఐ-పీసీబీల మధ్య ఆసియా కప్‌-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 వేదికల వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. ఐసీసీ పంపిన ముసాయిదా షెడ్యూల్‌కు పీసీబీ ఇంత వరకు ఆమోదం తెలుపలేదు. షెడ్యూల్‌కు ఆమోదం తెలపాల్సింది తమ ప్రభుత్వమని పీసీబీ తాత్కాలిక అధ్యక్షుడిగా దిగిపోయే ముందు నజమ్‌ సేథి ప్రకటన చేశాడు.

భద్రత కారణాల దృష్ట్యా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమని పీసీబీ స్పష్టం చేసింది. ఈ విషయంలోనే బీసీసీఐ-పీసీబీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు పీసీబీ కాబోయే ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌ ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించడంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించడం ఇష్టం లేదని, దీనికి తాను వ్యతిరేకమంటూ బాంబు పేల్చాడు.  

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ అధికారికంగా షెడ్యూల్‌ ప్రకటించాక అయినా పీసీబీ దానికి అమోదం తెలుపుతుందా లేక ఏవైనా కారణాలు సాకుగా చూపించి అడ్డుపుల్ల వేస్తుందా అన్న విషయం తేలాంటే ఒకటి రెండ్రోజుల వరకు వేచి చూడాల్సిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)