Breaking News

‘హైబ్రిడ్‌’ మోడల్‌పైనే చర్చ!

Published on Fri, 11/29/2024 - 04:17

దుబాయ్‌: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం వెలువడే సమయం వచి్చంది. పాకిస్తాన్‌ వేదికగా 2025 ఫిబ్రవరి–మార్చి నెలలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. అయితే భారత క్రికెట్‌ జట్టు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించడంతో వేదిక విషయంపై సందిగ్ధత నెలకొంది. టోర్నీ ప్రసారకర్తలతో ఒప్పందం ప్రకారం కనీసం 90 రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అది జరగనేలేదు. 

ఈ నేపథ్యంలో ఐసీసీ బోర్డు సభ్యులు శుక్రవారం సమావేశం కానున్నారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగే ఈ సమావేశంలో చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారు. లేదంటే ఓటింగ్‌ కూడా జరపాల్సి రావచ్చు. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ వన్డే టోర్నీ కి సంబంధించి ఐసీసీ వద్ద చర్చ కోసం మూడు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది హైబ్రిడ్‌ మోడల్‌. దీని ప్రకారం దాదాపు అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లోనే నిర్వహించి భారత్‌ ఆడే మ్యాచ్‌ల కోసం మరో దేశంలో ప్రత్యామ్నాయ వేదికను చూడటం. భారత్‌ నాకౌట్‌ దశకు చేరితే కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుత స్థితిలో ఇది సరైందిగా ఐసీసీ భావిస్తోంది. 

గత ఏడాది ఆసియా కప్‌ను కూడా ఇలాగే నిర్వహించారు. అయితే దీనికి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీపీ) ససేమిరా అంటోంది. దీనికి ఒప్పుకునేది లేదని గురువారం మరోసారి ఐసీసీకి సమాచారం అందించింది. రెండో ప్రతిపాదనతో పూర్తిగా టోరీ్నలో మరో దేశంలో (యూఏఈ కావచ్చు) నిర్వహించి ఆతిథ్య హక్కులు మాత్రం పాకిస్తాన్‌ వద్దే ఉంచడం. అయితే ఇప్పటికే టోర్నీ కోసం లాహోర్, కరాచీ స్టేడియాలను ఆధునీకరించి సిద్ధమవుతున్న పాకిస్తాన్‌ దీనికి ఎలాగూ అంగీకరించదు. పైగా 1996 వరల్డ్‌ కప్‌ తర్వాత అక్కడ ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదు. 

టోర్నీ దేశం దాటిపోతే ఆర్థికపరంగా బాగా నష్టం కూడా. మూడోది భారత్‌ లేకుండా టోర్నీని జరపడం. వాణిజ్యపరమైన అంశాలను చూసుకుంటే ఇది అసాధ్యమైన ప్రతిపాదన. మరోవైపు లీగ్‌ దశలో భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ను ఎక్కడ జరపాలనే అంశంపై కూడా ప్రత్యేక చర్చ జరగనుంది. హైబ్రిడ్‌ మోడల్‌కు తాము అంగీకరించాలంటే భారత్‌లో రాబోయే ఐదేళ్లలో జరిగే నాలుగు టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేస్తామని హామీని ఇవ్వాలని... తామూ భారత్‌కు వెళ్లమని పాక్‌ డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)