Breaking News

Champions Trophy 2025: ఐసీసీ అధికారిక ప్రకటన.. ఇకపై

Published on Thu, 12/19/2024 - 16:18

చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ప్రకటించింది. అదే విధంగా.. ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా పాకిస్తాన్‌ అక్కడ పర్యటించబోదని తెలిపింది. కాగా వచ్చే ఏడాది జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును పాక్‌కు పంపే ప్రసక్తి లేదని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐసీసీకి తేల్చి చెప్పింది. తాము టోర్నీలో పాల్గొనాలంటే తటస్థ వేదికల(హైబ్రిడ్‌ విధానం)పై టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) తొలుత ఇందుకు అంగీకరించలేదు.

షరతులు విధించిన పీసీబీ
అనేక చర్చలు, ఐసీసీ గట్టిగా హెచ్చరించిన అనంతరం పీసీబీ ఎట్టకేలకు పంతం వీడింది. అయితే, ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా హాజరుకాబోమని.. తమకు కూడా తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని షరతు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఐసీసీ తాజా ప్రకటనను బట్టి ఆ ఊహాగానాలు నిజమని తేలాయి.

ఆ టోర్నీలన్నింటికి ఇదే నిబంధన
ఇకపై భారత్‌- పాకిస్తాన్‌లలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగినపుడు హైబ్రిడ్‌ విధానాన్ని పాటిస్తామని గురువారం తెలిపింది. అంటే.. ఇరుజట్లు తమ దాయాది దేశాల్లో ఇకపై ఆడబోవని స్పష్టం చేసింది. చాంపియన్స్‌ ట్రోఫీ-2025(పాకిస్తాన్‌)తో పాటు మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ 2025(భారత్‌), పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026(భారత్‌- శ్రీలంక) టోర్నీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.

ఆస్ట్రేలియాలో మహిళల టోర్నమెంట్లు
అంతేకాదు.. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2028 ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్‌ దక్కించుకుందని ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది. దీనిని కూడా హైబ్రిడ్‌ మోడల్‌లోనే నిర్వహిస్తామని పేర్కొంది. ఇక 2029- 2031 మధ్య మహిళల సీనియర్‌ జట్లకు సంబంధించిన అన్ని ఐసీసీ టోర్నీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది.

కాగా హైబ్రిడ్‌ విధానంలో జరుగనున్న చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించాయి. మరోవైపు.. పాకిస్తాన్‌ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలో అడుగుపెట్టింది. 2017 చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచి ఈ అవకాశం దక్కించుకుంది. ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక ఈ టోర్నీకి సంబంధించి త్వరలోనే షెడ్యూల్‌ విడుదల కానుంది.

చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్‌ తండ్రి సంచలన ఆరోపణలు

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)