Breaking News

ENG Vs AFG: ఇదేమి సెక్యూరిటీరా బాబు.. మ‌రోసారి మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్‌

Published on Thu, 02/27/2025 - 08:45

పాకిస్తాన్ వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రోసారి భద్రతా లోపం తలెత్తింది. గొప్పలు చెప్పుకుంటున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించడంలో మాత్రం విఫలమవుతోంది. ఎంతమంది ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా అభిమానులు మాత్రం వారు కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొస్తున్నారు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం లహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ సంచలన విజయం సాధించింది.

ఈ క్రమంలో అఫ్గాన్ టీమ్ విన్నింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా.. ఓ ఊహించ‌ని సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో నుంచి ఓ వ్య‌క్తి మైదానంలో ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి అఫ్గాన్ ఆట‌గాళ్ల‌ను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన భద్రతా సిబ్బంది వెంటనే మైదానంలోకి వ‌చ్చి ఆ వ్యక్తిని బయటకు బ‌లవంతంగా తీసుకుళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఇదేమి తొలిసారి కాదు..
కాగా ఈ మెగా టోర్నీలో ఓ వ్య‌క్తి మైదానంలో దూసుకు రావ‌డం ఇదేమి తొలిసారి కాదు. రావ‌ల్పిండి వేదిక‌గా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా కూడా ఇటువంటి సంఘ‌ట‌నే చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని ఓ ఉగ్రవాద సంస్థ మద్దతుదారుడు పిచ్‌లోకి పరిగెత్తుకుంటూ వ‌చ్చి కివీ స్టార్ రచిన్ రవీంద్రను హత్తుకునే ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకుళ్లారు. సదరు వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, పాకిస్తాన్‌లోని ఏ క్రికెట్ వేదికలోకి అతడికి ప్రవేశం లేకుండా నిషేధించారు. కాగా ఈ ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్‌ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: #Jos Buttler: అఫ్గాన్‌ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం!

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)