Breaking News

ఆటను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తా: జై షా

Published on Fri, 12/06/2024 - 07:24

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నూతన చైర్మన్‌గా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జై షా క్రికెట్‌ను సమున్నత శిఖరాలకు తీసుకెళ్తానని అన్నారు. గురువారం చైర్మన్‌గా తొలిసారి ఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ కొత్త బాధ్యతలు ఉత్తేజంగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

‘నేను దేన్నయితే ఆసక్తిగా చూసేవాడినో (క్రికెట్‌)... అదే ఇప్పుడు నన్ను ప్రోత్సహిస్తుంది. మంచి గుర్తింపును ఇస్తుంది. అయితే నాకిది ఆరంభం మాత్రమే! క్రికెట్‌ క్రీడకు మరింత సొబగులద్దాలి. ఆట కొత్త శిఖరాలు అధిరోహించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటి నుంచే కష్టపడతాను. 

మేమంతా స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తాం’ అని అన్నారు. కార్యాలయ సందర్శన వల్ల సహచరులతో కలిసి పనిచేసేందుకు చక్కని సమన్వయం కుదురుతుందని, ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందన్నారు. రోడ్‌మ్యాప్‌కు అవసరమైన వ్యూహాలు ఇక్కడే మొదలవుతాయన్నారు. 

అంకితభావంతో పనిచేసే ఐసీసీ బృందంతో ఇలా పనిచేయడం మంచి అనుభూతి ఇస్తుందని పేర్కొన్నారు. జై షాకు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖ్వాజా ఐసీసీ కొత్త చైర్మన్‌ పదవీ కాలంలో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఆకాంక్షించారు.
చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్‌ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)