Breaking News

త్వరలో పాక్‌లో మరో ఐసీసీ టోర్నీ.. షెడ్యూల్‌ విడుదల

Published on Fri, 03/14/2025 - 21:25

త్వరలో పాకిస్తాన్‌ మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్‌ 9 నుంచి 19 వరకు పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఐసీసీ మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2025 పోటీలు జరుగనున్నాయి. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (మార్చి 14) విడుదల చేసింది.

ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ సహా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్‌లు జరుగనున్నాయి. డే మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకు.. డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

భారత్‌లో వరల్డ్‌కప్‌
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లు పోటీలోకి వస్తాయి.

కాగా, పాకిస్తాన్‌ ఇటీవలే ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిచ్చింది. 29 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై జరిగిన తొలి ఐసీసీ టోర్నీ ఇది. ఈ టోర్నీలో పాక్‌ ఘోర పరాభవం ఎదుర్కొంది. సొంతగడ్డపై జరిగిన టోర్నీలో పాక్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా, గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన పాక్‌కు ఇది పెద్ద అవమానం. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది. భద్రతా కారణాల రిత్యా ఈ టోర్నీలో భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది.

షెడ్యూల్‌
ఏప్రిల్‌ 9- పాక్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌, వెస్టిండీస్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌
ఏప్రిల్‌ 10- థాయ్‌లాండ్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌
ఏప్రిల్‌ 11- పాక్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌
ఏప్రిల్‌ 13- స్కాట్లాండ్‌ వర్సెస్‌ థాయ్‌లాండ్‌, బంగ్లాదేశ్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌
ఏప్రిల్‌ 14- వెస్టిండీస్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌
ఏప్రిల్‌ 15- థాయ్‌లాండ్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌
ఏప్రిల్‌ 17- బంగ్లాదేశ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌, పాక్‌ వర్సెస్‌ థాయ్‌లాండ్‌
ఏప్రిల్‌ 18- ఐర్లాండ్‌ వర్సెస్‌ స్కాట్లాండ్‌
ఏప్రిల్‌ 19- పాక్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ వర్సెస్‌ థాయ్‌లాండ్‌
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)