Breaking News

పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీ

Published on Wed, 09/18/2024 - 09:52

దుబాయ్‌: వచ్చే నెలలో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్‌ విజేతకు భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. పురుషుల వరల్డ్‌కప్‌ విజేతతో సమానంగా... మహిళల ప్రపంచకప్‌ చాంపియన్‌కు నగదు బహుమతి ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్ణయించింది. యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్‌ నుంచే దీనికి శ్రీకారం చుట్టనున్నట్లు ఐసీసీ మంగళవారం వెల్లడించింది. దీంతో మహిళల టి20 వరల్డ్‌ కప్‌ విజేతకు రూ. 19.60 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.

 గత ప్రపంచకప్‌ నగదు బహుమతితో పోల్చుకుంటే... ఇది 134 శాతం ఎక్కువ కావడం విశేషం. 2023లో నిర్వహించిన మహిళల టి20 ప్రపంచకప్‌ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 20.52 కోట్లు (2.45 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) కాగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ. 66.67 కోట్ల(7,958,080 అమెరికన్‌ డాలర్లు)కు పెంచారు. దీంతో రానున్న మెగాటోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన రెండు జట్లకు కూడా భారీగా నగదు బహుమతి అందుకోనున్నాయి. 

‘వచ్చే నెల జరగనున్న టి20 ప్రపంచకప్‌ నుంచి మహిళలకూ పురుషులతో సమానంగా నగదు బహుమతి ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ఇది క్రీడా చరిత్రలోనే సరికొత్త నిర్ణయం’అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదే జరిగిన పురుషుల టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.20 కోట్ల నగదు బహుమతి లభించింది. అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా టి20 ప్రపంచకప్‌ జరగనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్‌ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా... అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదిక మార్చాల్సి వచ్చింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)