Breaking News

Champions Trophy: ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా?

Published on Fri, 02/14/2025 - 13:16

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఫిబ్ర‌వ‌రి 19 నుంచి పాకిస్తాన్ వేదిక‌గా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత జ‌రుగుతున్న ఈ ఈమెగా ఈవెంట్‌లో మొత్తం 8 జ‌ట్లు భాగం కానున్నాయి.

ఇక‌ ఈ మెగా టోర్నీకి సంబంధించిన‌ ప్రైజ్‌మనీ వివరాలను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) శుక్ర‌వారం వెల్ల‌డించింది. మొత్తం ప్రైజ్‌ మనీ రికార్డు స్థాయిలో 6.9 మిలియన్ డాలర్లు(భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 60 కోట్లు)గా ఖరారు చేసింది. చివ‌ర‌గా 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీతో పోలిస్తే ఈ ప్రైజ్‌మనీ 53 శాతం అధికం కావ‌డం గ‌మ‌నార్హం.

విజేత‌కు ఎంతంటే?
ఇక ఈ మెగా టోర్నీ విజేత‌గా నిలిచే జ‌ట్టుకు 2.24 మిలియర్ డాల‌ర్లు (సుమారు రూ. 20 కోట్లు) న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌నుంది. అదేవిధంగా ర‌న్న‌ర‌ప్‌కు 1.12 మిలియన్‌ డాల‌ర్లు(సుమారు రూ. 12 కోట్లు), సెమీ ఫైన‌లిస్ట్‌లు ఒక్కొక్కరికి 560,000 డాల‌ర్లు(సుమారు రూ.5 కోట్లు) ల‌భించ‌నుంది. అంతేకాకుండా ప్ర‌తీ గ్రూపు మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించిన జట్టుకు సైతం ఐసీసీ ప్రైజ్‌మ‌నీ కేటాయించింది.

గ్రూపు స్టేజిలో విజ‌యం సాధించిన జ‌ట్టుకు 34,000 డాల‌ర్లు(సుమారు. 3 కోట్లు) అంద‌నుంది. అదేవిధంగా ఐదో, ఆరో స్ధానాల్లో నిలిచిన జ‌ట్లు 350,000 డాల‌ర్లు(రూ. 3 కోట్లు పైగా).. ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లు 140,000 డాల‌ర్లు(రూ. సుమారు 1. 2 కోట్లు) ద‌క్కించుకోనున్నాయి.  ఈ మెగా టోర్నీలో పాల్గోన్నంద‌కు ప్ర‌తీ జ‌ట్టుకు 125,000 డాల‌ర్లు(రూ.కోటి) ఐసీసీ అంద‌జేయ‌నుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 19న దుబాయ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్‌ ఆడే ‍మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ వేదికగానే జరగనున్నాయి.
చదవండి: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత తుది జట్టు ఇదే! ఆ స్టార్‌ ప్లేయర్లకు నో ఛాన్స్‌?

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)