Breaking News

ఐసీసీ అవార్డు రేసులో పేస్‌ బౌలింగ్‌ సంచలనం

Published on Tue, 02/06/2024 - 18:35

2024 జనవరి మాసం ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు నామినీస్‌ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్‌కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌, విండీస్‌ సంచలన బౌలర్‌ షమార్‌ జోసఫ్‌ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్‌లో అమీ హంట‌ర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేష‌న్ ద‌క్కించుకున్నారు. ఓటింగ్‌ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు.

ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్‌ దక్కింది..
షమార్‌ జోసఫ్‌: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్‌ యువ పేసర్‌ షమార్‌, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్‌ బ్యాటర్లను గడగడలాడించిన షమార్‌ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో షమార్‌ విశ్వరూపం​ (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్‌ 30 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ విజయాన్ని నమోదు చేసింది. 

జోష్‌ హాజిల్‌వుడ్‌: జనవరి నెలలో విండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో హాజిల్‌వుడ్‌ సైతం విజృంభించాడు. ఈ సిరీస్‌లో అతను రెండు మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్‌వుడ్‌ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు.

ఓలీ పోప్‌: ఈ ఇంగ్లీష్‌ బ్యాటర్‌ జనవరిలో ఆడిన మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ కారణంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో (హైదరాబాద్‌ టెస్ట్‌) పోప్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్‌ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. 
  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)