Breaking News

క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023 అవార్డు రేసులో కోహ్లి.. మరో రెండు అవార్డులకు కూడా..!

Published on Fri, 01/05/2024 - 17:04

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) 2023 అవార్డుల నామినీస్‌ జాబితాలను పలు దఫాలుగా ప్రకటిస్తూ వస్తుంది. తొలుత పురుషులు, మహిళలకు సంబంధించిన టీ20, ఎమిర్జింగ్‌ ప్లేయర్స్‌ నామినీస్‌ జాబితాను ప్రకటించిన ఐసీసీ.. ఆతర్వాత వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ నామినీస్‌ జాబితాను విడుదల చేసింది. తాజాగా ఐసీసీ.. టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీస్‌ జాబితాను ప్రకటించింది. 

క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీస్‌ జాబితాలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు ( విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా), ఇద్దరు ఆసీస్‌ ఆటగాళ్లు (పాట్‌ కమిన్స్‌, ట్రవిస్‌ హెడ్‌) ఉండగా.. టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నామినీస్‌ జాబితాలో ఇ‍ద్దరు ఆస్ట్రేలియన్లు (ట్రవిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖ్వాజా), ఓ టీమిండియన్‌ (రవిచంద్రన్‌ అశ్విన్‌), ఓ ఇంగ్లండ్‌ ఆటగాడు (జో రూట్‌) ఉన్నారు. 2023 ఐసీసీ అవార్డులలో విరాట్‌ కోహ్లి టెస్ట్‌ ఫార్మాట్‌ మినహా అన్ని విభాగాల్లో పోటీపడుతుండటం విశేషం.​

ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023:

  • విరాట్‌ కోహ్లి (భారత్‌)
  • పాట్‌ కమిన్స్‌ (ఆస్ట్రేలియా)
  • రవీంద్ర జడేజా (భారత్‌)
  • ట్రవిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా)

మెన్స్‌ టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023: 

  • రవిచంద్రన్‌ అశ్విన్‌ (భారత్‌)
  • ట్రవిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా)
  • ఉస్మాన్‌ ఖ్వాజా (ఆస్ట్రేలియా)
  • జో రూట్‌ (ఇంగ్లండ్‌)

మెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023: 

  • శుభ్‌మన్‌ గిల్‌ (భారత్‌)
  • మొహమ్మద్‌ షమీ (భారత్‌)
  • విరాట్‌ కోహ్లి (భారత్‌)
  • డారిల్‌ మిచెల్‌ (న్యూజిలాండ్‌)

వుమెన్స్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023: 

  • ఆష్లే గార్డ్‌నర్‌ (ఆస్ట్రేలియా)
  • చమారీ ఆటపట్టు (శ్రీలంక)
  • నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (ఇంగ్లండ్‌)
  • అమేలియా కెర్‌ (న్యూజిలాండ్‌)

మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2023: 

  • సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్‌)
  • సికందర్‌ రజా (జింబాబ్వే)
  • మార్క్‌ చాప్‌మన్‌ (న్యూజిలాండ్‌)
  • అల్పేశ్‌ రామ్‌జనీ (ఉగాండ)

వుమెన్స్‌ టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023:

  • చమారీ ఆటపట్టు (శ్రీలంక)
  • సోఫీ ఎక్లెస్టోన్‌ (ఇంగ్లండ్‌)
  • హేలీ మాథ్యూస్‌ (వెస్టిండీస్‌)
  • ఎల్లైస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా)

మెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023: 

  • యశస్వి జైస్వాల్‌ (భారత్‌)
  • రచిన్‌ రవీంద్ర (న్యూజిలాండ్‌)
  • గెరాల్డ్‌ కొయెట్జీ (సౌతాఫ్రికా)
  • దిల్షన్‌ మధుషంక (శ్రీలంక)

వుమెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2023: 

  • మరూఫా అక్తర్‌ (బంగ్లాదేశ్‌)
  • లారెన్‌ బెల్‌ (ఇంగ్లండ్‌)
  • డార్సీ కార్టర్‌ (స్కాట్లాండ్‌)
  • ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (ఆస్ట్రేలియా)


 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)