వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌ కీలక నిర్ణయం..

Published on Thu, 08/24/2023 - 14:29

వన్డే వరల్డ్‌ కప్‌ సన్నాహాల్లో భాగంగా మాజీ కెప్టెన్, కోచ్‌గా అనుభవజ్ఞుడైన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ను న్యూజిలాండ్‌ జట్టు తమ కోచింగ్‌ బృందంలోకి చేర్చింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐదుసార్లు విజేతగా నిలవడంలో కోచ్‌గా కీలకపాత్ర పోషించిన ఫ్లెమింగ్‌కు భారత గడ్డపై ఉన్న అపార అనుభవం తమ జట్టుకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందని కివీస్‌ బోర్డు భావించింది.

ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్లు జేమ్స్‌ ఫోస్టర్, బెల్‌ (ఇంగ్లండ్‌), సక్లాయిన్‌ (పాకిస్తాన్‌) కూడా కోచింగ్‌ టీమ్‌లోకి వచ్చారు. వన్డే ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌..  ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లు ఆడనుంది.  ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో  స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, పోస్టర్‌ కోచింగ్‌ బాధ్యతలు చెపట్టనుండగా.. ఇయాన్‌ బెల్‌ టీ20 సిరీస్‌ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.

అదే విధంగా సక్లాయిన్‌ కివీస్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఆగస్టు 30 నుంచి కివీస్‌.. ఇంగ్లండ్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో భాగంగా న్యూజిలాండ్‌ అతిథ్య ఇంగ్లండ్‌తో నాలుగు టీ20లు , నాలుగు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్‌ పర్యటన సెప్టెంబర్‌ 15న ముగయనుంది. అనంతరం బ్లాక్‌ క్యాప్స్‌ బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. బంగ్లా టైగర్స్‌త్‌తో మూడు వన్డేలు ఆడనుంది.
చదవండి: Ind Vs Pak: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. తుది జట్టులో తిలక్‌ వర్మకు ఛాన్స్‌! ఇక అయ్యర్‌..

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)