Breaking News

రిషబ్‌ పంత్‌ ఒక అద్భుతం.. ఎంతో మంది వికెట్‌ కీపర్‌లకు ఆదర్శం: గిల్‌క్రిస్ట్‌

Published on Wed, 09/20/2023 - 12:17

గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. రిషబ్‌ తన బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టేశాడు. అతడిని త్వరలోనే తిరిగి మైదానంలో చూసే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో పంత్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికీ పంత్‌ వంటి విధ్వంసకర బ్యాటర్‌ వరల్డ్‌కప్‌కు దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ప్రపంచకప్‌లో వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ బాధ్యతలు నిర్వహించనున్నాడు.

ఇక తన దూకుడుతో వరల్డ్‌ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పంత్‌పై ఆస్ట్రేలియా క్రికెట్‌ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిసబ్‌ తన విధ్వంసకర ఆట తీరుతో ఎంతో మంది యువ వికెట్‌కీపర్‌లకు ఆదర్శంగా నిలిచాడని గిల్‌క్రిస్ట్ కొనియాడాడు.

"ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వికెట్ కీపర్ బ్యాటర్‌లను రిషబ్‌ పంత్‌ తను ఆడే విధంగా ప్రేరేపించాడు. యువ వికెట్‌ కీపర్‌లు పంత్‌ను ఫాలో అవుతున్నారు. ఇది నిజంగా చాలా గ్రేట్‌. ఇక భారత్‌కు వికెట్‌ కీపర్‌లు చాలా మంది అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌కు కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ రూపంలో రెండు ఎంపికలు ఉన్నాయి.

కేఎల్‌ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నప్పుడు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అతడు తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపించాడు. ఇది నిజంగా భారత క్రికెట్‌కు శుభసూచికం అంటూ"  గిల్‌క్రిస్ట్‌ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి#Mohammed Shami: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్‌ షమీకి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్‌ మంజూరు

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)