Breaking News

అప్పుడు ధోని బాగా ఫీలయ్యాడు.. కానీ అక్కడ జడ్డూ ఉన్నాడు కదా: సీఎస్‌కే సీఈవో

Published on Thu, 06/22/2023 - 17:18

ఐపీఎల్‌-2023 ఛాంపియన్స్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గుజరాత్‌ టైటాన్స్‌ జరిగిన ఫైనల్లో గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగిన వెంటనే ధోని చాలా బాధ పడ్డాడని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. కాగా ఫైనల్‌ మ్యాచ్‌ కీలక సమయంలో అంబటి రాయుడు ఔటైన తర్వాతి బంతికే ధోని పెవిలియన్‌ చేరాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది.

ఈ క్రమంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆఖరి బంతికి ఫోర్‌ బాది తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు. తాజాగా ఇదే విషయంపై కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. "ఫైనల్‌ మ్యాచ్‌లో మా విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 38 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో రాయుడు వరుసగా రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాది మ్యాచ్‌ను మా వైపు మలుపు తిప్పాడు. అతడు అదే ఓవర్‌లో నాలుగో బంతికి ఔటయ్యాడు. 

దీంతో మా విజయానికి 14 బంతుల్లో  21 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ధోని క్రీజులోకి వచ్చాడు. అయితే అతడు ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. మేమంతా షాక్‌కు గురయ్యాం. గోల్డన్‌ డక్‌గా వెనుదిరగడం ఎంఎస్‌ను కూడా భాదించింది. ఇంత దగ్గరగా వచ్చి ఓడిపోతామో ఏమో అన్న భయం ధోని కళ్లలో కన్పించింది.

కానీ క్రీజులో ఇంకా జడేజా ఉన్నాడు కాబట్టి మేము నమ్మకంతోనే ఉన్నాం. చివరి  రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని జడ్డూ సిక్స్‌గా మలచడం మాకు మరింత నమ్మకం కలిగించింది. ఆఖరి బంతిని కూడా ధోని తనదైన స్ట్రైల్‌లో బౌండరీ పంపించాడు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Ashes 2nd Test: అతడిని పక్కన పెట్టి స్టార్క్‌ను తీసుకు రండి: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)