Breaking News

'చాలా గ్రేట్‌.. ధోని నుంచి చాలా నేర్చుకున్నా'

Published on Thu, 08/17/2023 - 09:10

శ్రీలంక యువ పేస్‌ సంచలనం మతీషా పతిరానా ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్యాష్‌రిచ్‌ లీగ్‌లో చెన్నైసూపర్‌ కింగ్స్‌ తరపున బరిలోకిన దిగిన పతిరానా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ బౌలింగ్‌ యాక్షన్‌ను పోలివున్న 20 ఏళ్ల పతిరానా.. తన స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు.

ముఖ్యంగా ఎంఎస్‌ ధోని సారథ్యంలో పతిరానా మరింత రాటుదేలాడు. ఐపీఎల్‌లో దుమ్మురేపిన పతిరానా.. ఇప్పుడు శ్రీలంక జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు. అతడు ప్రస్తుతం లంక ప్రీమియర్‌ లీగ్‌లో బీజీబీజీగా ఉన్నాడు. ఇక తాజాగా ఓ స్పోర్ట్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పతిరనా కీలక వాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌, సీఎస్‌కే సారధి ఎంఎస్‌ ధోని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అని అతడు తెలిపాడు.

"ఒక యువ ఆటగాడిగా కెరీర్‌ను మొదలపెట్టినప్పుడు ఎవరైన భరోసా కల్పిస్తే అది మనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ధోని లాంటి లెజెండరీ క్రికెటర్‌ నాకు మద్దతుగా నిలిచాడు. నాపై చాలా నమ్మకం ఉంచాడు. ఆ సమయంలో నేను ఏదైనా చేయగలనని నమ్మాను. నాకే కాదు.. చాలా మంది యువ ఆటగాళ్లకు ధోని సపోర్ట్‌గా నిలిచాడు.

మా జట్టులో నలుగురు, ఐదుగురు అగ్రశ్రేణి ఆటగాళ్లు గాయపడిన సమయంలో.. ధోని యువ ఆటగాళ్లపై చాలా నమ్మకం ఉంచాడు. అతడు నిజంగా చాలా గ్రేట్‌. ధోని నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అతడి ప్రశాంతత, వినయం నన్ను ఎంతగానే అకట్టుకున్నాయి. అందుకే అతడు తన కెరీర్‌లో విజయవంతమయ్యాడు.

42 ఏళ్ల వయస్సులో కూడా ఎంఎస్‌ చాలా ఫిట్‌గా ఉన్నాడు. ధోని మా లాంటి యువ ఆటగాళ్లకు ఎంతో స్ఫూర్తిదాయకం.నేను సీఎస్‌కేతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చాలా చిన్నవాడిని. అప్పడు ధోనినే నాకు చాలా విషయాలు నేర్పించాడని పతిరానా పేర్కొన్నాడు.
చదవండి: #Rishabh Pant: బ్యాట్‌ పట్టిన రిషబ్‌ పంత్‌.. సిక్సల వర్షం​!‍ వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)