Breaking News

ప్లీజ్‌.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్‌

Published on Wed, 06/07/2023 - 08:16

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 సైకిల్‌ తుది అంకానికి చేరుకుంది. బుధవారం(జూన్‌ 7) నుంచి 11 వరకు జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ సైకిల్ ముగియనుంది. ఇక లండన్‌ వేదికగా జరగన్న తుదిపోరులో భారత్‌- ఆస్ట్రేలియా తాడోపేడో తెల్చుకోనేందుకు సిద్దమయ్యాయి. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌ విజయం సాధిస్తే సెలబ్రేట్‌ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నాని స్వాన్ అన్నాడు. ఓవల్‌ మైదానంలో జూన్‌ ఆరంభంలో మ్యాచ్‌ జరగుతుంది కాబట్టి పిచ్‌ చాలా ఫ్లాట్‌గా ఉందని, పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ అభిప్రాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో జియో సినిమాతో స్వా్న్‌ మాట్లాడుతూ.. ఓవల్‌ పిచ్‌పై గ్రాస్‌ ఉండడంతో కచ్చితంగా పేసర్లకు అనుకూలిస్తుంది. బౌన్స్‌ కూడా ఎ‍క్కువగా ఉండే అవకాశం ఉంది. ఓవల్‌ దాదాపు వాంఖడేలోని ఎర్ర మట్టి పిచ్‌ల మాదిరిగానే ఉంటుంది. బౌన్స్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సిల్లీ పాయింట్, షార్ట్-లెగ్ ఫీల్డర్‌లను తీసుకువస్తే బాగుంటుంది.

ఒక వేళ స్పిన్నర్లను ఆడించాలి అనుకుంటే టార్గెట్‌ డిఫెండ్‌ చేసుకోవడానికి భారీ స్కోర్‌ సాధించాలి. అయితే విజేతగా ఎవరు నిలుస్తురన్నది నేను ముందే ఊహించలేను. ఎందుకంటే రెంటు జట్లు వరల్డ్‌ క్లాస్‌ టీమ్స్‌. కానీ ఒక ఇంగ్లీష్‌ మ్యాన్‌గా ఈ ఫైనల్‌ పోరులో ఆస్ట్రేలియాను భారత్‌ ఓడిస్తే చూడాలని ఉంది. ప్రస్తుత భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్‌ బౌలర్లు ఉన్నారు. కాబట్టి ఆసీస్‌కు కూడా తీవ్రమైన పోటీ తప్పదు అని పేర్కొన్నాడు.
చదవండి: WTC Final 2023: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భరత్‌కు అవకాశం దక్కేనా? మరి అశ్విన్‌!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)