Breaking News

హైదరాబాద్‌ 536/8 డిక్లేర్డ్‌

Published on Mon, 10/28/2024 - 03:13

సాక్షి, హైదరాబాద్‌: సొంతగడ్డపై జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు భారీ స్కోరు చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పుదుచ్చేరితో పోరులో బ్యాటర్లంతా కలిసి కట్టుగా కదం తొక్కడంతో హైదరాబాద్‌ జట్టు 163 ఓవర్లలో 536/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (328 బంతుల్లో 173; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ సెంచరీతో విజృంభించగా... రోహిత్‌ రాయుడు (84; 7 ఫోర్లు, 1 సిక్స్‌), హిమతేజ (60; 7 ఫోర్లు), తనయ్‌ త్యాగరాజన్‌ (53 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో రాణించారు.

 ఓవర్‌నైట్‌ స్కోరు 290/1తో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్‌ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు తన్మయ్, రోహిత్‌ 220 పరుగులు జోడించడంతో గట్టి పునాది పడింది. కెపె్టన్‌ రాహుల్‌ సింగ్‌ (27), వికెట్‌ కీపర్‌ రాహుల్‌ రాధేశ్‌ (24) ఎక్కువ సేపు నిలవలేకపోగా... చామా మిలింద్‌ (7) ఆకట్టుకోలేకపోయాడు. మిడిలార్డర్‌ విఫలమైనా... ఆఖర్లో తనయ్‌ త్యాగరాజన్‌ మెరుపులు మెరిపించాడు. పుదుచ్చేరి బౌలర్లలో అంకిత్‌ శర్మ 3, సతీశ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. 

కొండంత స్కోరు చేసిన అనంతరం హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా... చివరి గంటలో బ్యాటింగ్‌కు వచ్చిన పుదుచ్చేరి బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పుదుచ్చేరి 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. శ్రీధర్‌ రాజు (19), సాగర్‌ (0) అవుట్‌ కాగా... వికెట్‌ కీపర్‌ అజయ్‌ రొహెరా (3) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 

హైదరాబాద్‌ బౌలర్లలో రోహిత్‌ రాయుడు, అనికేత్‌ రెడ్డి చెరో వికెట్‌ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న పుదుచ్చేరి జట్టు... హైదరాబాద్‌ స్కోరుకు ఇంకా 512 పరుగులు వెనుకబడి ఉంది. గౌరవ్‌ యాదవ్‌ (0 బ్యాటింగ్‌), ఆకాశ్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

స్కోరు వివరాలు 
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (సి) (సబ్‌) విఘ్నేశ్వరన్‌ (బి) అంకిత్‌ శర్మ 173; అభిరత్‌ రెడ్డి (సి) అరుణ్‌ కార్తీక్‌ (బి) సాగర్‌ 68; రోహిత్‌ రాయుడు (బి) ఫాబిద్‌ అహ్మద్‌ 84; హిమతేజ (సి) అమన్‌ (బి) సతీశ్‌ 60; రాహుల్‌ సింగ్‌ (సి) గంగ శ్రీధర్‌ రాజు (బి)గౌరవ్‌ యాదవ్‌ 27; రాహుల్‌ రాధేశ్‌ (సి అండ్‌ బి) అంకిత్‌ శర్మ 24; చామా మిలింద్‌ (బి) సతీశ్‌ 7; తనయ్‌ త్యాగరాజన్‌ (నాటౌట్‌) 53; అనికేత్‌ రెడ్డి (బి) అంకిత్‌ శర్మ 12; రక్షణ్‌ రెడ్డి (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (163 ఓవర్లలో 8 వికెట్లకు డిక్లేర్‌) 536. 
వికెట్ల పతనం: 1–111, 2–231, 3–345, 4–397, 5–440, 6–458, 7–460, 8–486. బౌలింగ్‌: గౌరవ్‌ యాదవ్‌ 35–9–102–1; సాగర్‌ 31–5–98–1; ఫాబిద్‌ అహ్మద్‌ 30–6–78–1; అమన్‌ ఖాన్‌ 11–1–55–0; అంకిత్‌ శర్మ 35–1–117–3, సతీశ్‌ 20–2–72–2.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)