Breaking News

సెమీస్‌లో హైదరాబాద్‌

Published on Fri, 08/30/2024 - 02:43

చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇని్వటేషన్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ మధ్యప్రదేశ్‌ జట్టుతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఇన్నింగ్స్‌ 229 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్‌ జట్టు రెండు విజయాలు సాధించి 13 పాయింట్లతో ‘టాప్‌’లో నిలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

మ్యాచ్‌ మూడో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 439/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ 129.3 ఓవర్లలో 6 వికెట్లకు 560 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. వరుణ్‌ గౌడ్‌ (63 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), టి.రవితేజ (54 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 353 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మధ్యప్రదేశ్‌ జట్టు 47 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. 

హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి 46 పరుగులిచ్చి 5 వికెట్లు, తనయ్‌ త్యాగరాజన్‌ 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు రెండో రోజు హైదరాబాద్‌ ఓపెనర్‌ ఎం. అభిరత్‌ రెడ్డి (243 బంతుల్లో 211; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)