Breaking News

Golf League: అదరగొట్టిన ఈగల్‌ హంటర్స్‌, సామా ఏంజెల్స్‌

Published on Mon, 01/30/2023 - 12:10

Hyderabad Premier Golf League: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ మరింత రసవత్తరంగా మారింది. గ్రూప్ స్టేజ్‌లో ఆధిక్యం కోసం జట్లన్నీ పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. తాజాగా మూడో సీజన్ సెకండ్ లెగ్ పోటీల్లో అండర్ డాగ్స్ సెంట్రో ఈగల్ హంటర్స్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 113 పాయింట్లతో అత్యుత్తమంగా రాణించింది. ఈగల్ హంటర్స్ తరపున కేవీఎస్ ఎన్ రెడ్డి, సురేష్ రాణించారు.

అదే విధంగా.. తొలిసారి మహిళలు ఓనర్లుగా ఉన్న ఏకైక గోల్ఫ్‌ టీమ్‌ ‘సమా ఏంజెల్స్‌’ టీమ్‌.. మూడో సీజన్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. సరోజా వివేక్‌, మాధవి ఉప్పలపాటి ఓనర్లుగా వ్యవహరిస్తున్న సమా టీమ్‌ వికారాబాద్‌లోని వూటీ గోల్ఫ్‌ కోర్స్‌లో జరిగిన మూడో రౌండ్‌లో సత్తా చాటింది.

సరోజా వివేక్‌, మాధవి సహా టీమ్‌ గోల్ఫర్లు ఆకట్టుకున్నారు. ఈ రౌండ్‌లో సామా ఏంజెల్స్‌ 109 పాయింట్లు సాధించింది. సిటీలో జరుగుతున్న అది పెద్ద లీగ్‌ అయిన హెచ్‌పీజీఎల్‌లో నాలుగు గ్రూప్స్‌లో 16 టీమ్స్‌ పాల్గొంటున్నాయి. ఒక్కో టీమ్‌లో 10 మంది గోల్ఫర్లు ఉన్నారు.

ఇక గ్రూప్‌ దశలో తొలి రెండు రౌండ్లు హెచ్‌సీఏ, బౌల్డర్‌ హిల్స్‌లో నిర్వహించారు. వచ్చే బుధ, శనివారాల్లో గ్రూప్‌ దశలో చివరి రౌండ్లు జరుగనున్నాయి. అనంతరం నాకౌట్‌ రౌండ్‌ ఆరంభమవుతుంది. ప్రతి గ్రూప్‌ నుంచి రెండు టీమ్స్‌ క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. వచ్చే నెల 24న థాయ్‌లాండ్‌లో ఫైనల్స్‌ను జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్‌.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా..
Gongadi Trisha: శెభాష్‌ బిడ్డా! మ్యాచ్‌ను మలుపు తిప్పిన త్రిష.. భద్రాచలంలో సంబరాలు

#

Tags : 1

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)