Breaking News

IPL 2024 KKR Vs SRH: ఆఖరి బంతికి...

Published on Sun, 03/24/2024 - 00:55

కోల్‌కతా: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టాలంటే కొండంత లక్ష్యాన్ని కరిగించాలి. ఒక దశలో గెలవడానికి 24 బంతుల్లో 76 పరుగులు కావాలి. దీంతో కోల్‌కతా విజయం లాంఛనమే అనిపించింది. కానీ హెన్రిచ్‌ క్లాసెన్‌ (29 బంతుల్లో 63; 8 సిక్స్‌లు) భారీ సిక్సర్లు ఒక్కసారిగా హైదరాబాద్‌ విజయానికి ఊపిరిపోశాయి. 17, 18, 19వ ఓవర్లలో వరుసగా 16, 21, 26 పరుగులు వచ్చాయి. వరుణ్‌ 3 సిక్సర్లు ఇవ్వగా...స్టార్క్‌ ఓవర్లో క్లాసెన్‌ 3, షహబాజ్‌ ఒక సిక్సర్‌ బాదారు! అంతే ఆఖరి 6 బంతులకు 13 పరుగులు సన్‌రైజర్స్‌ వైపు మొగ్గేలా చేసింది.

హర్షిత్‌ రాణా వేసిన ఈ ఓవర్లో తొలి బంతికే క్లాసెన్‌ సిక్స్‌ బాదడంతో 5 బంతుల్లో 7 పరుగులు హైదరాబాద్‌ను సంబరాల్లో ముంచింది. కానీ హర్షిత్‌ (3/33) వైవిధ్యమైన బంతులతో రెండే పరుగులిచ్చి షహబాజ్‌ (16; 1 ఫోర్, 2 సిక్స్‌లు), క్లాసెన్‌లను అవుట్‌ చేశాడు. చివరి బంతికి గెలవాలంటే 5 పరుగులు కావాల్సి ఉండగా కమిన్స్‌ సింగిల్‌ కూడా తీయలేకపోయాడు. దాంతో కోల్‌కతా 4 పరుగులతో అనూహ్య విజయం సాధించింది. దీంతో గెలుపుదారిలో పడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ఈ ఐపీఎల్‌ సీజన్‌ను ప్రారంభించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా రెండో ఓవర్‌ నుంచే కష్టాల్లో పడింది.

నరైన్‌ (2), వెంకటేశ్‌ అయ్యర్‌ (7), శ్రేయస్‌ అయ్యర్‌ (0), నితీశ్‌ రాణా (9) చేతులెత్తేశారు. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా... 14వ ఓవర్లో అతనూ అవుటయ్యాడు. కోల్‌కతా స్కోరు 119/6. అప్పుడు క్రీజులోకి వచ్చిన రస్సెల్‌ (25 బంతుల్లో 64 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) చాన్నాళ్ల తర్వాత విధ్వంసరచన చేశాడు. దీంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగుల భారీస్కోరు చేసింది. మిగిలిన 6.1 ఓవర్లలోనే జట్టు 89 పరుగులు చేస్తే అందులో రసెల్‌ ఒక్కడివే 64 పరుగులంటే... హైదరాబాద్‌ బౌలర్లు కూడా ప్రేక్షకులు కావాల్సివచ్చింది.

రసెల్‌ 20 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. నటరాజన్‌ 3, మయాంక్‌ మార్కండే 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసి ఓడింది. మయాంక్‌ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ (19 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే స్వల్ప వ్యవధిలో మార్క్‌రమ్‌ (18), రాహుల్‌ త్రిపాఠి (20) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.  

స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) జాన్సెన్‌ (బి) మార్కండే 54; నరైన్‌ రనౌట్‌ 2; వెంకటేశ్‌ (సి) జాన్సెన్‌ (బి) నటరాజన్‌ 7; శ్రేయస్‌  (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 0; నితీశ్‌ (సి) త్రిపాఠి (బి) మార్కండే 9; రమణ్‌దీప్‌ (సి) మార్కండే (బి) కమిన్స్‌ 35; రింకూ సింగ్‌ (సి) మార్కండే (బి) నటరాజన్‌ 23; రసెల్‌ నాటౌట్‌ 64; స్టార్క్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–23, 2–32, 3–32, 4–51, 5–105, 6–119, 7–200. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–51–0, జాన్సెన్‌ 3–0–40–0, నటరాజన్‌ 4–0–32–3, కమిన్స్‌ 4–0–32–1, మార్కండే 4–0–39–2, షహబాజ్‌ 1–0–14–0. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) రింకూ (బి) హర్షిత్‌ 32; అభిషేక్‌ (సి) వరుణ్‌ (బి) రసెల్‌ 32; త్రిపాఠి (సి) హర్షిత్‌ (బి) నరైన్‌ 20; మార్క్‌రమ్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 18; క్లాసెన్‌ (సి) సుయశ్‌ (బి) హర్షిత్‌ 63; సమద్‌ (సి) వెంకటేశ్‌ (బి) రసెల్‌ 15; షహబాజ్‌ (సి) శ్రేయస్‌ (బి) హర్షిత్‌ 16; జాన్సెన్‌ నాటౌట్‌ 1; కమిన్స్‌ నాటౌట్‌ 0;  ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–60, 2–71, 3–107, 4–111, 5–145, 6–203, 7–204. బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–53–0, హర్షిత్‌ రాణా 4–0–33–3, వరుణ్‌ 4–0–55–1, నరైన్‌ 4–0–19–1, రసెల్‌ 2–0–25–2, సుయశ్‌ 2–0–18–0.    

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ X  లక్నో
వేదిక: జైపూర్‌
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి 

గుజరాత్‌ X ముంబై
వేదిక: అహ్మదాబాద్‌

రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)