Breaking News

IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు

Published on Mon, 03/10/2025 - 21:04

ఇండియన్‌ ప్రొ బాక్సింగ్‌ లీగ్‌(IPBL)లో భాగంగా వరల్డ్‌ చాంపియన్స్‌తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్‌ బే- ఆంటొని పెట్టిస్‌ ఏపీఎఫ్‌సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ పోటీల్లో అక్షయ్‌ చహల్‌- సబరి జయశంకర్‌ సత్తా చాటారు. 

హైదరాబాద్‌ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్‌ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్‌లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌కు భారత్‌ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.

అక్షయ్‌-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్‌ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది.  ఈ సందర్భంగా మాజీ యూఎఫ్‌సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్‌ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్‌ లీగ్‌లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.

అ‍గ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ అసమాన హోస్ట్‌ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. 

ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్‌ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్‌ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)