Breaking News

శంషాబాద్ ఎయిర్ పోర్టులో గొంగడి త్రిషకు ఘన స్వాగతం.. వీడియో

Published on Tue, 02/04/2025 - 10:57

మ‌హిళ‌ల అండ‌ర్‌-19 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తెలుగు అమ్మాయి గొంగ‌డి త్రిష(gongadi trisha) అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే. త‌న ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో భార‌త్‌కు వ‌రుస‌గా రెండోసారి వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను త్రిష అందించింది.  ఏడు ఇన్నింగ్స్‌‌లలో 309 పరుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీగా త్రిష నిలిచింది.

అంతేకాకుండా బౌలింగ్‌లోనూ తొమ్మిది వికెట్ల‌తో త్రిష సత్తా చాటింది. ఇక భార‌త్‌ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన త్రిష సోమ‌వారం ఆర్ద రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టింది. స్వదేశానికి చేరుకున్న త్రిషకు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రావు ఘన స్వాగ‌తం ప‌లికారు. త్రిషతో పాటు ద్రితి కేసరి,టీమ్ హెడ్ కోచ్ నూసిన్, ఫిట్నెస్ ట్రైనర్ శాలిని కూడా తమ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో త్రిష మాట్లాడారు.

"అండర్ 19 వరల్డ్ కప్‌లో మేం పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇక నుంచి మరింత కష్టపడి సీనియర్ టీమ్‌లో చోటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో ఆడుతున్నప్పటికి నేను ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. ప్రతీ మ్యాచ్‌లో నా పాత్రపై మాత్రమే దృష్టి పెట్టాను అని త్రిష పేర్కొంది.

మరోవైపు తన సహచర ప్లేయర్ ద్రితిపై త్రిష ప్రశంసల వర్షం కురిపించింది. "ద్రితి అద్భుతమైన ప్లేయర్‌. కానీ జట్టు కూర్పు వల్ల ఆమెకు ఈసారి ఆడే అవకాశం లభించలేదు. కానీ కచ్చితంగా భవిష్యత్తులో ఆమె అద్భుతాలు సృష్టిస్తుందని" త్రిష కొనియాడింది.

ద్రితి మాట్లాడుతూ.. "తొలుత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడం కాస్త బాధగా అన్పించింది. కానీ రెండు మ్యాచ్‌ల తర్వాత దేశం కోసమే ఆలోచించాను. భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన టీమ్‌లో నేను భాగం కావడం చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో అద్బుతంగా రాణిస్తాన్న నమ్మకం నాకు ఉంది. ఈ టోర్నీలో త్రిష​ తీవ్రంగా శ్రమించింది" అని చెప్పుకొచ్చారు.
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్నేసిన కోహ్లి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)