Breaking News

హైదరాబాద్‌ క్రికెటర్‌ రామ్‌చరణ్‌పై బీసీసీఐ వేటు.. కారణమిదే?

Published on Tue, 12/30/2025 - 10:12

వయస్సును తక్కువగా చూపించి దేశవాళీ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆడిన హైదరాబాద్‌ క్రికెటర్‌పై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండేళ్ల నిషేధం విధించింది. బోర్డు అధికారిక అండర్‌–16 టోర్నీ విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో మర్కట్ట రామ్‌చరణ్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున బరిలోకి దిగాడు.

లీగ్‌ దశలో హైదరాబాద్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలపై రామ్‌చరణ్‌ మూడు సెంచరీలు నమోదు చేశాడు. అయితే రామ్‌చరణ్‌ వయసుకు సంబంధించిన సందేహం కారణంగా వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) విచారణ జరిపింది. 

విచారణలో రామ్‌చరణ్‌కు రెండు వేర్వేరు తేదీలతో ‘బర్త్ సర్టిఫికెట్ ’లు ఉన్నట్లు, అతను తన వయసును తక్కువగా చూపించి అండర్‌–16 టోర్నీలో ఆడినట్లు తేలింది. దాంతో బీసీసీఐ అతడిని రెండేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్‌ నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత రామ్‌చరణ్‌ మళ్లీ ఆడవచ్చని...అయితే ఎలాంటి వయో విభాగంతో సంబంధం లేకుండా కేవలం సీనియర్‌ స్థాయిలోనే బరిలోకి దిగాల్సి ఉంటుందని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.    

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)