Breaking News

శభాష్‌ హృతిక్‌

Published on Sun, 09/15/2024 - 04:09

సాక్షి, హైదరాబాద్‌: అంచనాలకు మించి రాణించి... తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్లను ఓడించి... హైదరాబాద్‌ కుర్రాడు హృతిక్‌ కటకం ఆసియా అండర్‌–14 టెన్నిస్‌ చాంపియన్‌íÙప్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో హృతిక్‌ టైటిల్‌ గెలిచే క్రమంలో టాప్‌ సీడ్, రెండో సీడ్, మూడో సీడ్‌ క్రీడాకారులను ఓడించడమే కాకుండా... తన ప్రత్యర్థులకు ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. 

ఫైనల్లో హృతిక్‌ 6–3, 7–5తో రెండో సీడ్‌ డాంగ్‌జే కిమ్‌ (దక్షిణ కొరియా)ను ఓడించి టైటిల్‌ దక్కించుకున్నాడు. తొలి రౌండ్‌లో హృతిక్‌ 6–0, 6–0తో యితియన్‌ లూ (చైనా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 6–1, 6–1తో మూడో సీడ్‌ రమ్తిన్‌ రఫీ»ొరుజెని (ఇరాన్‌)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో టాప్‌ సీడ్‌ ధర్మ పాంతారాటోర్న్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందాడు. హైదరాబాద్‌కే చెందిన డేవిస్‌కప్‌ ప్లేయర్, లండన్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ విష్ణువర్ధన్‌ దిశానిర్దేశనంలో హృతిక్‌ ముందుకు సాగుతున్నాడు. 

హైదరాబాద్‌ హబ్సిగూడలోని ట్రినిటీ చాలెంజర్స్‌ టెన్నిస్‌ అకాడమీలో కోచ్‌లు హెన్రీ ప్రవీణ్, రామకృష్ణ వద్ద హృతిక్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. పుణేలోని ఆర్యన్‌ పంప్స్‌కు చెందిన ప్రశాంత్‌ సుతార్‌ హృతిక్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఆసియా టైటిల్‌తో హృతిక్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగే ప్రతిష్టాత్మక ఎడ్డీ హెర్, ఆరెంజ్‌ బౌల్‌ చాంపియన్‌íÙప్‌ పోటీలకు కూడా అర్హత సాధించాడు. 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)