Breaking News

తనయ్, అనికేత్‌ మాయాజాలం

Published on Mon, 01/27/2025 - 04:01

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే నాకౌట్‌ దశకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన హైదరాబాద్‌ జట్టు రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టుతో ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో ముగిసిన గ్రూప్‌ ‘బి’ ఆరో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు ఇన్నింగ్స్‌ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి 7 పాయింట్లు సంపాదించింది. చామా మిలింద్‌ సారథ్యంలో ఈ మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ జట్టుకు ఇద్దరు స్పిన్నర్లు తనయ్‌ త్యాగరాజన్, అనికేత్‌ రెడ్డి తమ ప్రదర్శనతో విజయాన్ని కట్టబెట్టారు. 

ఫాలోఆన్‌ ఆడుతూ ఆఖరి రోజు ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హిమాచల్‌ జట్టు వన్డే తరహాలో ఆడి 45.4 ఓవర్లలో 247 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ 118 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మరో ఎడంచేతి వాటం స్పిన్నర్‌ గంగం అనికేత్‌ రెడ్డి 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 

హిమాచల్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభం అరోరా (72 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా... అంకిత్‌ కాల్సి (39 బంతుల్లో 44; 6 ఫోర్లు), వైభవ్‌ అరోరా (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. మ్యాచ్‌ మొత్తంలో తొమ్మిది వికెట్ల తీసిన అనికేత్‌ రెడ్డికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘బి’లో హైదరాబాద్‌ ఆరు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 

రెండు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ విజయాలు సాధించి... రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 16 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. నాగ్‌పూర్‌లో ఈనెల 30 నుంచి జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో విదర్భ జట్టుతో హైదరాబాద్‌ ఆడుతుంది.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)