Breaking News

మళ్లీ ఓడిన హైదరాబాద్, ఆంధ్ర.. విహారి, హెబ్బర్‌ రాణించినా..!

Published on Thu, 11/30/2023 - 12:19

జైపూర్‌: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ మరో పరాజయాన్ని చవిచూసింది. బుధవారం గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో సర్వీసెస్‌ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ 50 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. రాహుల్‌ బుద్ధి (87 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తన్మయ్‌ అగర్వాల్‌ (45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. సర్వీసెస్‌ 40.5 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది. కెప్టెన్‌ రజత్‌ పలివాల్‌ (101 బంతుల్లో 77 నాటౌట్‌; 6 ఫోర్లు), వినీత్‌ ధన్కర్‌ (76 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో  సర్వీసెస్‌ను గెలిపించారు.  

విహారి, హెబ్బర్‌ రాణించినా..
చండీగఢ్‌: గ్రూప్‌ ‘డి’లో ఆంధ్ర జట్టు కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడింది. రాజస్తాన్‌ 38 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా రాజస్తాన్‌ 50 ఓవర్లలో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిజిత్‌ తోమర్‌ (115 బంతుల్లో 124; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, రామ్‌ చౌహాన్‌ (68 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. పిన్నింటి తపస్వికి 4 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఆంధ్ర 47.4 ఓవర్లలో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. హనుమ విహారి (80 బంతుల్లో 60; 9 ఫోర్లు), అశ్విన్‌ హెబ్బర్‌ (89 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా... మిడిలార్డర్‌ వైఫల్యంతో ఆంధ్ర ఓటమిపాలయ్యింది. అనికేత్‌ చౌదరి 4 వికెట్లతో దెబ్బ తీసాడు. 


 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)