సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం.. 100 బంతుల్లో 241 రన్స్‌

Published on Wed, 08/05/2026 - 09:47

ది హండ్రెడ్ మెన్స్ టోర్నీలో సన్‌రైజర్స్ లీడ్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. మంగ‌ళ‌వారం హెడింగ్లే వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు.

తొలుత ఓపెనర్లు మిచెల్ మార్ష్‌, ర్యాన్ రికెల్టన్ లండన్ స్పిరిట్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరూ హెడింగ్లే మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు. మార్ష్ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, రికెల్టన్ కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు కేవలం 54 బంతుల్లోనే 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

తద్వారా పురుషుల హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్ ఓడిగా మార్ష్‌-రికెల్టన్ రికార్డు సృష్టించారు. మార్ష్ 37 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 76 పరుగులు చేసి ఔటైనప్పటికి రికెల్టన్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు.

ర్యాన్ కేవలం 42 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌(18 బంతుల్లో 5 ఫోర్లు,5  సిక్స్‌లతో 55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా సన్‌రైజర్స్ నిర్ణీత 100 బంతుల్లో 2 వికెట్ల నష్టానికి 241 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది.

విల్లీ మెరుపులు వృథా
భారీ లక్ష్యచేధనతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(0), లువాన్-డ్రే ప్రిటోరియస్(5)లను రీస్ టోప్లే పెవిలియన్‌కు పంపాడు. లియామ్ లివింగ్‌స్టోన్ (13బంతుల్లో 34) కౌంటర్ ఎటాక్ చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

ఒకానొక దశలో స్పిరిట్ 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  ఈ సమయంలో లోయార్డర్‌ బ్యాటర్‌ డేవిడ్‌ విల్లీ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. 

అతడితో పాటు ఓవర్టన్‌(15 బంతుల్లో 27) దూకుడుగా ఆడాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో లండన్‌ జట్టు నిర్ణీత వంద బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమైంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)