సామ్ కుర్రాన్ ఆల్‌రౌండ్ షో.. తిరుగులేని ఓవల్ ఇన్విన్సిబుల్స్

Published on Tue, 08/19/2025 - 09:37

ది హాండ్రడ్ లీగ్‌-2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది.  ఈ టోర్నీలో భాగంగా సోమ‌వారం సౌతాంప్టన్ వేదిక‌గా సదరన్ బ్రేవ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఇన్విన్సిబుల్స్ ఘ‌న విజ‌యం సాధించింది.  ఈ విజ‌యంతో ఇన్విన్సిబుల్స్ త‌మ టాప్ ప్లేస్‌ను మ‌రింత ప‌దిలం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స‌ద‌ర‌న్ బ్రేవ్ జ‌ట్టు 98 బంతుల్లో 133 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఓవల్ ఇన్విన్సిబుల్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్‌, స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ చెరో మూడు వికెట్లు ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధిని దెబ్బ‌తీశారు. వారిద్ద‌రితో పాటు బెహ్రెన్‌డార్ఫ్ రెండు, టామ్ కుర్రాన్ త‌లా వికెట్ సాధించారు. స‌ద‌ర‌న్ బ్రేవ్ బ్యాట‌ర్ల‌లో టాప‌ర్డ‌ర్ విఫ‌లం కాగా.. లోయార్డ‌ర్‌లో కార్ట్ రైట్(42), జే థామ్స‌న్‌(24) రాణాంచారు.

కాక్స్‌, కుర్రాన్ విధ్వంసం..
అనంత‌రం 134 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో  ఓపెన‌ర్లు విల్ జాక్స్‌(1) , టవాండా ముయేయే(9) ఔట్ చేసి ఇన్విన్సిబుల్స్‌కు క్రెయిగ్ ఓవ‌ర్ట‌న్ భారీ షాకిచ్చాడు. అయితే ఈ స‌మ‌యంలో జోర్డాన్ కాక్స్‌(56), సామ్ కుర్రాన్‌(50 నాటౌట్) ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై ఎదురు దాడికి దిగారు. 

దీంతో ఓవ‌ల్ జ‌ట్టు ల‌క్ష్యాన్ని కేవ‌లం మూడు వికెట్లు కోల్పోయి 89 బంతుల్లోనే చేధించింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన సామ్ కుర్రాన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ జ‌ట్టు త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఆగస్టు 21న ట్రెంట్ రాకర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)