విధ్వంసం సృష్టించిన వార్నర్‌.. బెయిర్‌స్టో మెరుపులు వృధా

Published on Sun, 08/10/2025 - 08:04

ఆసీస్‌ మాజీ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ చాలాకాలం​ తర్వాత తనదైన మార్కు విధ్వంసం సృష్టించాడు. ద హండ్రెడ్‌ లీగ్‌-2025లో లండన్‌ స్పిరిట్‌కు ఆడుతున్న వార్నర్‌.. నిన్న (ఆగస్ట​్‌ 9) వెల్ష్‌ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన అతని జట్టు (లండన్‌ స్పిరిట్‌) నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

లండన్‌ స్పిరిట్‌ ఇన్నింగ్స్‌లో వార్నర్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 14, జేమీ స్మిత్‌ 26, ఆస్టన్‌ టర్నర్‌ 24, సీన్‌ డిక్సన్‌ 14, జేమీ ఓవర్టన్‌ 0, రే జన్నింగ్స్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు. వెల్ష్‌ ఫైర్‌ బౌలర్లలో జోష్‌ హల్‌ 2 వికెట్లు తీయగా.. డేవిడ్‌ పేన్‌, రిలే మెరిడిత్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెల్ష్‌ ఫైర్‌.. జానీ బెయిర్‌స్టో (50 బంతుల్లో 86 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికీ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బెయిర్‌స్టోతో పాటు క్రిస్‌ గ్రీన్‌ (32 నాటౌట్‌) అద్భుతంగా పోరాడినప్పటికీ వెల్ష్‌ ఫైర్‌ గెలవలేకపోయింది. 

వెల్ష్‌ ఫైర్‌ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో, గ్రీన్‌ మినహా ఎవరూ రాణించలేకపోయారు. స్టీవ్‌ స్మిత్‌ 3, లూక్‌ వెల్స్‌ 12, టామ్‌ ఏబెల్‌ 5, టామ్‌ కొహ్లెర్‌ 4, సైఫ్‌ జైబ్‌ 2, పాల్‌ వాల్టర్‌ 6 పరుగులకు ఔటయ్యారు. స్పిరిట్‌ బౌలర్లలో డేనియల్‌ వార్రల్‌ 2, లూక్‌ వుడ్‌, రిచర్డ్‌ గ్లీసన్‌, జేమీ ఓవర్టన్‌, లియామ్‌ డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)