Breaking News

తొలి మ్యాచ్‌లో తలపడనున్న సన్‌రైజర్స్‌- ముంబై ఇండియన్స్‌

Published on Tue, 07/21/2026 - 21:33

క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో ధనాధన్ లీగ్ సిద్దమైంది. 'ది హండ్రెడ్' (The Hundred) 6వ ఎడిషన్ మంగ‌ళ‌వారం (జులై 21) నుంచి ప్రారంభం కానుంది. మ‌హిళ‌ల‌ ది హండ్రెడ్ కూడా ఈ రోజు నుంచే మొద‌లు కానుంది.

ఈ రెండు టోర్నీల్లోనూ మొద‌టి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్, ఎంఐ లండ‌న్‌ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ రెండు జ‌ట్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలైన‌ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ముంబై ఇండియ‌న్స్‌కు యాజ‌మాన్యానికి చెందినివే కావ‌డం గ‌మ‌నార్హం.

34 రోజుల పాటు సాగే ఈ వంద బంతుల టోర్నీలో మొత్తం 8 జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఎంఐ లండన్‌, సన్‌రైజర్స్ లీడ్స్,  మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సదరన్ బ్రేవ్,లండన్ స్పిరిట్ , బర్మింగ్‌హామ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్,  వెల్ష్ ఫైర్ జట్లుగా ఉన్నాయి. 

ఈ టోర్నీలో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన కీలక ఆటగాళ్లు కూడా భాగం కానున్నారు. ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 16న జరగనుంది. ఈ లీగ్‌కు సంబంధించిన మ్యాచ్‌లను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు.

జట్లు ఇవే
1.ఏంఐ లండన్ (MI London)  
సామ్ కర్రన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, టామ్ కర్రన్, రిచర్డ్ గ్లీసన్, విల్ జాక్స్, రషీద్ ఖాన్, క్యాలమ్ పార్కిన్సన్, ఓలీ పోప్, నికోలస్ పూరన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నాథన్ సోటర్, ఓలీ స్టోన్, ఓలీ సైక్స్, జేమ్స్ విన్స్, ఎడ్డీ జాక్, సెబ్ మోర్గాన్.

2.సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds)  
జాక్ క్రాలీ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, టామ్ ఆల్సోప్, ఎడ్ బర్నార్డ్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, నాథన్ ఎల్లిస్, బెన్నీ హోవెల్, టామ్ లావెస్, డేనియల్ లారెన్స్, మిచెల్ మార్ష్, లియామ్ పాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, ర్యాన్ రికెల్టన్, రీస్ టోప్లీ, చార్లీ అల్లిసన్, మ్యాటీ రెవిస్.

3.మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (Manchester Super Giants)
ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), గుస్ అట్కిన్సన్, సోనీ బేకర్, జోస్ బట్లర్, లియామ్ డాసన్, ల్యూస్ డు ప్లూయ్, టామ్ హార్ట్లీ, మాక్స్ హోల్డెన్, హెన్రిచ్ క్లాసెన్, టామ్ మూర్స్, తవాండా ముయెయ్, నూర్ అహ్మద్, జార్జ్ స్క్రిమ్‌షౌ, పాల్‌ష్‌ స్క్రిమ్‌షా, టిమ్‌ష్ టోయిఫ్‌షా, టిమ్ష్ ఫించ్, జేమ్స్ సేల్స్.

4.సదరన్ బ్రేవ్ (Southern Brave) 
క్రిస్ జోర్డాన్ (కెప్టెన్), టామ్ అబెల్, జోఫ్రా ఆర్చర్, నిఖిల్ చౌదరి, కాలెబ్ ఫాల్కనర్, బెన్ మెక్‌కిన్నీ, డేవిడ్ మిల్లర్, మైఖేల్ పెప్పర్, ఆదిల్ రషీద్, థామస్ రేవ్, జేమీ స్మిత్, మార్కస్ స్టోయినిస్, ట్రిస్టన్ స్టబ్స్, ల్యూక్ వుడ్, డాన్ వోరాల్, మ్యానీ లమ్స్‌డెన్, సైఫ్ జైబ్.

5. లండన్ స్పిరిట్ (London Spirit) 
లియామ్ లివింగ్‌స్టోన్ (కెప్టెన్), జానీ బేయిర్‌స్టో, డెవాల్డ్ బ్రెవిస్, జేమ్స్ కోల్స్, మేసన్ క్రేన్, మాట్ ఫిషర్, టైమల్ మిల్స్, ఆడమ్ మిల్నే, జేమీ ఓవర్‌టన్, లువాన్-డ్రే ప్రిటోరియస్, జేమ్స్ రేవ్‌, డేవిడ్ విల్లీ, ఆడమ్ జంపా, కిరణ్ కార్ల్‌సన్, హెన్రీ క్రోకోంబ్.

6. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ (Birmingham Phoenix)  
జాకబ్ బెథెల్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జో క్లార్క్, స్కాట్ కర్రీ, లారీ ఎవాన్స్, డోనోవన్ ఫెరీరా, సాకిబ్ మహమూద్, మాథ్యూ మాంట్‌గోమెరీ, మిచ్ ఓవెన్, ముస్తఫిజుర్ రెహమాన్, విల్ స్మీడ్, ఉస్మాన్ తారిఖ్, జోర్డాన్ థాంప్సన్, క్రిస్ వుడ్, సీన్ డిక్సన్, టామ్ హెల్మ్

7. ట్రెంట్ రాకెట్స్
సామ్ బిల్లింగ్స్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మొహమ్మద్ అమీర్, టామ్ బాంటన్, డానీ బ్రిగ్స్, బ్రాడ్ కర్రీ, టిమ్ డేవిడ్, అనూరిన్ డొనాల్డ్, బెన్ డకెట్, లూయిస్ గ్రెగొరీ, మాట్ హెన్రీ, లూయిస్ కింబర్, బెన్ మేయెస్, డాన్ మౌస్లీ, క్రెయిగ్ ఓవర్టన్, మిచెల్ సాంట్నర్, బెన్ రైన్, బెన్ సాండర్సన్.

8. వెల్ష్ ఫైర్ (Welsh Fire)
ఫిల్ సాల్ట్ (కెప్టెన్), టామ్ ఆస్పిన్‌వాల్, జాఫర్ చోహన్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, లాకీ ఫెర్గూసన్, మార్కో జాన్సెన్, బెన్ కెల్లవే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, రచిన్ రవీంద్ర, జో రూట్, మాట్ షార్ట్, ఆసా ట్రైబ్, క్రిస్ వోక్స్, జోర్డాన్ క్లార్క్, డిల్లన్ పెన్నింగ్టన్.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)