IPL 2025: రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ షాక్‌

Published on Thu, 05/01/2025 - 20:04

మినుకు మినుకు మంటూ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు కలిగిన దశలో రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ సందీప్‌ శర్మ గాయం కారణంగా సీజన్‌ మొత్తానికే దూరమ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌ సందర్భంగా సందీప్‌ వేలు ఫ్రాక్చర్‌ అయినట్లు రాయల్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ తెలిపాడు.

సందీప్‌ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న విషయాన్ని ఆర్‌ఆర్‌ యాజమాన్యం అధికారికంగా దృవీకరించింది. సందీప్‌ గుజరాత్‌ మ్యాచ్‌లో వేలుకు ఫ్రాక్చర్‌ అయినప్పటికీ బౌలింగ్‌ను కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో అతను తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్‌ తీశాడు. 

సందీప్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని రాయల్స్‌ యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. సందీప్‌కు డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌గా మంచి పేరుంది. లీగ్‌ కీలక దశలో సాగుతున్న వేల సందీప్‌ వైదొలగడం రాయల్స్‌కు పెద్ద మైనస్సే. ప్రస్తుత సీజన్‌లో సందీప్‌ 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. 

ముంబైతో ఇవాళ (మే 1) జరుగతున్న మ్యాచ్‌లో సందీప్‌కు ప్రత్యామ్నాయంగా ఆకాశ్‌ మధ్వాల్‌ చోటు దక్కించుకున్నాడు. మధ్వాల్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్‌.

రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిదానంగా ఆడుతుంది. రాయల్స్‌ బౌలర్లు బాగా బౌలింగ్‌ చేస్తున్నారు.  ఓపెనర్లు రికెల్టన్‌ (27), రోహిత్‌ శర్మ (17) ఆచితూచి ఆడుతున్నారు. ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌ రోహిత్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 45/0గా ఉంది.

ఈ మ్యాచ్‌ కోసం రాయల్స్‌ రెండు మార్పులు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. హసరంగ, సందీప్‌ శర్మ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కుమార్‌ కార్తికేయ, ఆకాశ్‌ మధ్వాల్‌ రాయల్స్‌ తుది జట్టులోకి వచ్చారు. 

తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్, ఫజల్‌హక్ ఫరూఖీ

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

కాగా, ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. 

మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ఖర్చీఫ్‌ వేసుకోవాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుం‍చి మూడో స్థానంలో ఉంది. 
 

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)