Breaking News

కోహ్లి ఆరోజే సెంచరీ చేయాలి.. 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి: రిజ్వాన్‌

Published on Tue, 10/31/2023 - 17:24

ICC WC 2023- Virat Kohli- Mohammad Rizwan: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 48 శతకాలు పూర్తి చేసుకున్నాడు. తన సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ కూడా సాధ్యంకాని రీతిలో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైం రికార్డుకు చేరవవుతున్నాడు.

వన్డేల్లో గనుక ఈ రన్‌మెషీన్‌ మరో రెండు శతకాలు బాదితే సచిన్‌ను వెనక్కి నెడతాడు కూడా! ఇక వరల్డ్‌కప్‌-2023లోనే విరాట్‌ కోహ్లి ఈ ఘనత సాధించాలని అభిమానులు ఆశపడుతున్నారు. పుట్టినరోజున సచిన్‌ రికార్డు సమం చేసి.. ఆ తర్వాత దానిని బ్రేక్‌ చేయాలని కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ఇండియా టుడేతో మాట్లాడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌కు కోహ్లి గురించి ప్రశ్న ఎదురుకాగా..

ఆరోజే తను 49వ సెంచరీ చేయాలి
‘‘నవంబరు 5న తన బర్త్‌డేనా? మంచిది.. నిజానికి నాకు ఇలాంటివి సెలబ్రేట్‌ చేసుకోవడం ఇష్టం ఉండదు.. అయినా.. తనకు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 

విరాట్‌ తన బర్త్‌డే నాడే 49వ వన్డే సెంచరీ సాధించాలి. అంతేకాదు ఈ వరల్డ్‌కప్‌లోనే 50వ శతకం కూడా పూర్తి చేసుకోవాలి’’ అని ఆకాంక్షించాడు. విరాట్‌ కోహ్లికి ఆ సత్తా ఉందని రిజ్వాన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

కాగా నవంబరు 5న కోహ్లి బర్త్‌డే అన్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఆరోజే కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమిండియా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ సందర్భంగా కోహ్లి తన కెరీర్‌లో అరుదైన ఘనత సాధించాలని రిజ్వాన్‌ కోరుకోవడం విశేషం. 

ఈడెన్‌ గార్డెన్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు..
విరాట్‌ కోహ్లి పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసేందుకు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(CAB) ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు క్యాబ్‌ అధ్యక్షుడు స్నేహాశిష్‌ గంగూలీ మాట్లాడుతూ.. 

ప్రత్యేకంగా 70 వేల మాస్కులు
‘‘విరాట్‌ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంటున్నాం. ఈ విషయంలో ఐసీసీ నుంచి మాకు అనుమతి వస్తుందనే అనుకుంటున్నాం. స్టేడియానికి వచ్చే ప్రతి అభిమాని కోహ్లి మాస్కులు ధరించేందుకు వీలుగా 70 వేల మాస్కులు పంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం’’ అని తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో కంటే ముందు టీమిండియా శ్రీలంకతో మ్యాచ్‌ ఆడనుంది.

అంతకంటే ముందే సెంచరీ కావాలి
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇరు జట్లు పోటీపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌లోనే కోహ్లి సెంచరీ కొడితే.. బర్త్‌డేన మరో శతకం బాది సచిన్‌ రికార్డు(49 సెంచరీలు) బద్దలు కొడితే ఇంకా బాగుంటుందని కింగ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చదవండి: అప్పుడు ద్రవిడ్‌ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు: షోయబ్‌ మాలిక్‌ 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)