Breaking News

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ విధ్వంసం.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ

Published on Fri, 10/30/2026 - 20:33

హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మోంగ్ కోక్‌లోని మిషన్ రోడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 38 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టు నిర్ణీత 6 ఓవ‌ర్లలో 4 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 159 ప‌రుగులు చేసింది.

బ్రయంట్ మెరుపు హాఫ్ సెంచ‌రీ
ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ మాక్స్ బ్రయంట్, ఫ‌స్ట్ డౌన్ బ్యాట‌ర్ నిక్ హాబ్సన్ మెరుపు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన బ్ర‌యంట్‌.. కేవ‌లం 9 బంతుల్లోనే త‌న అర్ధ శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. అత‌డు ఓవ‌రాల్‌గా కేవలం 11 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 56 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

నిక్ హాబ్సన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్ద‌రితో పాటు జాక్ వుడ్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 40 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో నాథన్ గిల్‌క్రిస్ట్ 2 వికెట్లు పడగొట్టాడు.

అనంత‌రం 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ జాన్ సింప్సన్ 12 బంతుల్లోనే 1 ఫోర్, 8 సిక్సర్లతో 54 పరుగులు చేసి రిటైర్డ్ నాటౌట్‌గా నిలిచాడు. అత‌డితో పాటు  మార్టిన్ ఆండర్సన్ 22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 పరుగులు చేసినప్పటికీ, జట్టును విజయ‌ తీరాలకు చేర్చలేకపోయాడు.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)