Breaking News

గొప్ప గుర్తింపే... కానీ ఇక్కడితోనే ఆగిపోను!

Published on Sat, 01/04/2025 - 04:31

అమృత్‌సర్‌ శివారు గ్రామంలోని రైతు బిడ్డ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌. హాకీలో మేటి ఆటగాడిగా ఎదిగాడు. దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌ చరిత్రలో వరుస పతకాలు సాధించిన జట్టును నడిపించిన అతన్ని ప్రతిష్టాత్మక ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపిక చేశారు. 

ఈసారి హర్మన్‌తో పాటు ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గుకేశ్, ఒలింపిక్స్‌ ‘డబుల్‌ ధమాకా’ మనూ భాకర్‌ (షూటింగ్‌), పారాలింపిక్‌ చాంప్‌ ప్రవీణ్‌లను ఆ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తన హాకీ ప్రయాణం, ప్రతిష్టాత్మక అవార్డు సాఫల్యంపై హర్మన్‌ హర్షం వ్యక్తం చేశాడు.  

న్యూఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’కు ఎంపికైన భారత హాకీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ తన కెరీర్‌లో ఇదో గొప్ప సాఫల్యమన్నాడు. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతోనే మురిసిపోనని, కెరీర్‌లో మరెన్నో మైలురాళ్లు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెప్పాడు. 

టోక్యో–2020, పారిస్‌–2024 ఒలింపిక్స్‌లలో భారత హాకీ జట్టు వరుసగా కాంస్య పతకాలు సాధించింది. ఇందులో స్టార్‌ డ్రాగ్‌ ఫ్లికర్‌ హర్మన్‌ కీలక భూమిక పోషించాడు. భారత అత్యున్నత క్రీడా పురస్కారానికి ఎంపికైన హర్మన్‌ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... 

ఈ పయనం ఎంతో నేర్పింది 
హాకీలో నా ప్రయాణం నాకెంతో నేరి్పంది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కొన్నింటా గెలిచాం. మరికొన్ని మ్యాచ్‌ల్లో ఓడాం. కానీ ఫలితాలేవైనా నాకన్నీ అవి అనుభవ పాఠాలే. కెరీర్‌ మొదలైన రోజే నేనెలా ఎలా మెరుగవ్వాలి. ఏం చేయాలని నా మనసుకు స్వీయ లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు జట్టుగా... సహచరులతో కలిసికట్టుగా విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌ పతకాల్లో, నా ‘ఖేల్‌రత్న’లో సహచరుల అండదండలున్నాయి. 

ప్రపంచకప్‌ పతకమే లక్ష్యం 
హాకీలో అడుగు పెట్టిన 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతీ మ్యాచ్‌ను అస్వాదించాను. విజయానుభూతిని అనుభవించాను. ఓటమిని జీర్ణించుకున్నాను. ఇలా నేనెంచుకున్న క్రీడలో ప్రతీక్షణం సంతృప్తికరంగానే గడిచింది. అయితే ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ప్రపంచకప్‌ పతకమే! 

బెల్జియంలో వచ్చే ఏడాది జరిగే ఈవెంట్‌లో భారత్‌ను సన్నద్ధం చేయడానికి తగిన సమయం లభించింది. ఒలింపిక్స్‌లో స్వర్ణం, మేజర్‌ టోర్నీల్లో విజయాలే మా జట్టు లక్ష్యాలు. దీనికోసం ఒక్కోఅడుగు ముందుకు వేయాల్సి ఉంటుంది.  

ఇప్పుడప్పుడే రిటైర్మెంటా? 
ఇప్పుడైతే దృష్టంతా ఆటపైనే ఉంది. రిటైర్మెంట్‌కు చాలా సమయం ఉంది. ప్రపంచకప్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు మిగిలే ఉన్నాయి. జట్టును పరిస్థితులకు తగ్గట్లుగా తయారు చేసి మేజర్‌ ఈవెంట్లలో గట్టి ప్రత్యర్థిగా బరిలోకి దించే కసరత్తు నిరంతరం చేస్తూనే ఉంటాం.

ముఖ్యంగా మ్యాచ్‌ల్లో టీమ్‌ కాంబినేషనే అత్యంత కీలకమవుతుంది. గెలిచినపుడు పొంగిపోయినట్లే ఓడినపుడు కుంగిపోకుండా ఎక్కడ లోపం జరిగిందో దృష్టిపెట్టి అధిగమించాల్సి ఉంటుంది.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)