Breaking News

BFI: హైకోర్టు అనుమతి.. అనురాగ్‌ ఠాకూర్‌కు లైన్‌ క్లియర్

Published on Fri, 03/21/2025 - 12:35

సిమ్లా: భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పోటీ పడేందుకు అనుమతించాలని హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఠాకూర్‌ నామినేషన్‌ దాఖలు చేసేందుకు వీలుగా నామినేషన్ల గడువును పొడిగించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

బీఎఫ్‌ఐ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర బాక్సింగ్‌ సంఘం ప్రతినిధిగా పోటీ పడేందుకు ఠాకూర్‌ సిద్ధం కాగా... బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్‌ సింగ్‌ ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.

ఆయా రాష్ట్ర సంఘాల్లో ఎన్నికల ద్వారా గెలిచి ఆఫీస్‌ బేరర్లుగా కొనసాగుతున్న వారికే ఇక్కడా పోటీ పడే అవకాశం ఉంటుందని... ఈ కారణంగా ఠాకూర్‌ అనర్హుడంటూ రిటర్నింగ్‌ అధికారి ఈ నెల 7న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ కోర్టుకెక్కారు.

 2008 నుంచి వేర్వేరు హోదాల్లో తాను రాష్ట్ర సంఘంలో పని చేశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాల అనంతరం... బీఎఫ్‌ఐ ఉత్తర్వులకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదని, ఠాకూర్‌ను ఎన్నికలకు అనుమతించాలంటూ హిమాచల్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

భారత్‌ ఖాతాలోనే ‘ఇండియన్‌ టూర్‌’ స్క్వాష్‌ టైటిల్‌ 
ఫైనల్లో అనాహత్‌తో ఆకాంక్ష ‘ఢీ’  
చెన్నై: స్క్వాష్‌ రాకెట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) ఇండియన్‌ టూర్‌ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ భారత్‌కు ఖరారైంది. భారత్‌కే చెందిన అనాహత్‌ సింగ్, ఆకాంక్ష సాలుంఖే ఫైనల్‌కు చేరుకోవడంతో ఇది సాధ్యం కానుంది. 

గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో అనాహత్‌ 11–6, 11–3, 11–4తో హీలీ వార్డ్‌ (దక్షిణాఫ్రికా)పై, టాప్‌ సీడ్‌ ఆకాంక్ష 11–5, 11–7, 11–7తో భారత్‌కే చెందిన స్టార్‌ జోష్నా చినప్పపై విజయం సాధించారు. ఫైనల్‌ శుక్రవారం జరుగుతుంది.

క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆకాంక్ష 11–8, 10–12, 4–11, 11–8, 11–9తో నాదియా ఎల్‌హమి (ఈజిప్ట్‌)పై, అనాహత్‌ 11–3, 11–3, 7–11, 11–1తో క్రిస్టినా గోమెజ్‌ (స్పెయిన్‌)పై, జోష్నా చినప్ప 11–7, 11–5, 11–4తో సోఫియా మటియోస్‌ (స్పెయిన్‌)పై గెలుపొందారు. 

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కే చెందిన వీర్‌ చోత్రాని, మెల్విల్‌ సియానిమనికో (ఫ్రాన్స్‌) టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో వీర్‌ 11–5, 11–7, 12–10తో రవిందు లక్సిరి (శ్రీలంక)పై, మెల్విల్‌11–7, 11–2, 11–7తో డీగో గొబ్బి (బ్రెజిల్‌)పై విజయం సాధించారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)