Breaking News

6 బంతుల్లో 4 పరుగులు.. చేతిలో 5 వికెట్లు.. అయినా ఓటమి

Published on Sun, 02/26/2023 - 16:58

ఆస్ట్రేలియన్‌ వుమెన్స్‌ నేషనల్‌ క్రికెట్‌ లీగ్‌ తుది సమరంలో ఆసక్తికర పరిణామాలు చోటు​ చేసుకున్నాయి. హోబర్ట్‌ వేదికగా సౌత్‌ ఆస్ట్రేలియా-టాస్మానియా జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ అనూహ్య మలుపులు తిరిగి క్రికెట్‌లోని అసలుసిసలు మజాను ప్రేక్షకులకు అందించింది. అసలు ఏం జరిగిందంటే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టాస్మానియా నిర్ణీత 50 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.

ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించి (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో), సౌత్‌ ఆస్ట్రేలియాకు 243 పరుగుల టార్గెట్‌ను కుదించారు. ఈ క్రమంలో చివరి నిమిషం వరకు సౌత్‌ ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగింది. చివరి ఓవర్‌కు ముందు సమీకరణలు ఇలా ఉన్నాయి. ఆఖరి ఓవర్‌లో సౌత్‌ ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 4 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో సౌత్‌ ఆస్ట్రేలియా జట్టు గెలుపు నల్లేరుపై నడకే అని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాచ్‌ అనూహ్య మలుపులు తిరిగింది. సౌత్‌ ఆస్ట్రేలియా జట్టు చివరి ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పరుగు తేడాతో ఓటమిపాలైంది. టాస్మానియా బౌలర్‌ కోయటే ఆఖరి ఓవర్‌లో మ్యాజిక్‌ చేసింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండు రనౌట్లు చేసి తన జట్టును వరుసగా రెండో ఏడాది ఛాంపియన్‌గా నిలబెట్టింది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)