Breaking News

హార్దిక్‌ పాండ్యాకు గ్రాండ్‌ వెల్‌కమ్‌

Published on Mon, 07/15/2024 - 21:27

టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం తొలిసారి తన సొంత పట్టణమైన వడోదరకు వచ్చిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. హార్దిక్‌ను ఎయిర్‌పోర్ట్‌ నుంచి ర్యాలీగా తీసుకెళ్లేందుకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హార్దిక్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంలో వడోదర వీధుల గుండా తన స్వగృహానికి చేరకున్నాడు. హార్దిక్‌ విజయోత్సవ ర్యాలీకి ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. 

హార్దిక్‌ నామస్మరణతో వడోదర వీధులు మార్మోగిపోయాయి. హార్దిక్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం​ చేస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. హార్దిక్‌ విజయోత్సవ ర్యాలీకి చెందిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ర్యాలీ అనంతరం పట్టణంలోని ఓ బహిరంగ ప్రదేశంలో హార్దిక్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి హార్దిక్‌తో పాటు అతని సోదరుడు కృనాల్‌ పాండ్యా కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో "చక్‌దే ఇండియా" పాట ప్లే చేయగా జనాలు ఉర్రూతలూగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతుంది.

కాగా, హార్దిక్‌ పాండ్యా టీ20 వరల్డ్‌కప్‌ విజయానంతరం ముంబైలో జరిగిన టీమిండియా విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అక్కడే ఉండిపోయాడు. అనంతరం​ హార్దిక్‌ అనంత అంబానీ వివాహా వేడుకలో సందడి చేసి ఇవాళ (జులై 15) వడోదరకు చేరుకున్నాడు.

ఇదిలా ఉంటే.. యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్‌ 29న సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్‌.. ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి రెండోసారి జగజ్జేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో హార్దిక్‌ చివరి ఓవర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)