Breaking News

IPL 2024: స్టార్క్‌ వేయబోయే ఒక్కో బంతి విలువ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

Published on Tue, 12/19/2023 - 18:40

వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ హైయ్యెస్ట్‌ పెయిడ్‌ ప్లేయర్‌ మిచెల్‌ స్టార్క్‌ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షలకు పైమాటే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 2024 సీజన్‌లో స్టార్క్‌ వేయబోయే ఒక్కో బంతి విలువ 7 లక్షల 36 వేల 607 రూపాయలు. లీగ్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని మొత్తం. ఏ బౌలర్‌ కలలోనూ ఇంత మొత్తాన్ని ఊహించి ఉండడు. 

అయితే స్టార్క్‌కు ఇంత మొత్తం లభించాలంటే అతన్ని కొనుగోలు చేసిన కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌కు ముందే నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ దశ దాటి ఫైనల్స్‌కు చేరితే స్టార్క్‌కు లభించే మొత్తంలో కోత పడుతుంది. వచ్చే సీజన్‌లో కేకేఆర్‌ ఫైనల్స్‌కు చేరే క్రమంలో దాదాపుగా 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. స్టార్క్‌ 16 మ్యాచ్‌లు ఆడాల్సి వస్తే ఒక్కో బంతికి లభించే మొత్తం 6.44 లక్షలకు తగ్గిపోతుంది. 

కాగా, దుబాయ్‌లోని కోకోకోలా ఎరినాలో ఇవాళ (డిసెంబర్‌ 19) జరిగిన ఐపీఎల్‌ 2024 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు మిచెల్‌ స్టార్క్‌ను 24 కోట్ల 75 లక్షల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఓ ఆటగాడికి లభించే అత్యధిక ధర ఇదే. స్టార్క్‌కు ఇంత భారీ ధర దక్కక ముందు అతని సహచరుడు, ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఈ స్థాయి ధరనే లభించింది.

కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు వరకు ఐపీఎల్‌ ఆల్‌టైమ్‌ అత్యధిర ధర 18.5 కోట్లుగా ఉండింది. గత సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ కర్రన్‌ను ఈ రికార్డు ధరకు కొనుగోలు చేసింది.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)