Breaking News

అదే మా కొంప‌ముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్

Published on Sat, 05/31/2025 - 11:48

ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ ప్ర‌యాణం ముగిసింది. శుక్ర‌వారం ముల్లాన్‌పూర్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్‌లో 20 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైన గుజ‌రాత్‌.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం ప‌ట్టింది. 229 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో గుజ‌రాత్ విఫ‌ల‌మైంది. 

సాయిసుద‌ర్శ‌న్‌(81), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడిన‌ప్ప‌టికీ మిగితా బ్యాట‌ర్లు తేలిపోవ‌డంతో గుజ‌రాత్ ఓట‌మి చ‌విచూడాల్సి వ‌చ్చింది. ల‌క్ష్య చేధ‌న‌లో టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్ప‌యి 208 ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం గుజ‌రాత్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్పందించాడు. త‌మ పేల‌వ ఫీల్డింగ్ కార‌ణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు.

"క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుత‌మైన గేమ్‌. ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించలేరు. ఈ మ్యాచ్‌లో మేము ఆఖ‌రి వ‌ర‌కు పోరాడి ఓడిపోయాము. చివ‌రి మూడు, నాలుగు ఓవ‌ర్ల‌లో మాకు కలిసి రాలేదు. అయిన‌ప్ప‌టికి మేము బాగానే ఆడాము. క‌చ్చితంగా క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయి.

ఈ మ్యాచ్‌లో మేము మూడు సునాయ‌స క్యాచ్‌లు జార‌విడిచాము. ఈజీగా క్యాచ్‌ల‌ను వ‌దిలిస్తే బౌల‌ర్లకు ప‌రుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుద‌ర్శ‌న్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు మేము ఒక‌టే మెసేజ్ పంపాము.  ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జ‌ట్టును గెలిపించ‌డమే వారద్ద‌రి ల‌క్ష్యం.

మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ సీజ‌న్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గ‌త మూడు మ్యాచ్‌లలో మేము స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాము. కానీ జ‌ట్టులోని ప్ర‌తీ ఒక్క‌రూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుద‌ర్శ‌న్ ఒక అద్బుం. ఈ సీజన్‌లో అత‌డు ఆసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్‌లో గిల్ పేర్కొన్నాడు.
చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ​ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్‌

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)