Breaking News

అయ్యో పాపం.. ఒక్క పరుగుతో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌

Published on Mon, 02/09/2026 - 16:32

ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ యువ బ్యాటర్‌ సుదిప్‌ కుమార్‌ ఘరామీ తృటిలో ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

రంజీ ట్రోఫీ చరిత్రలో ఓ ఆటగాడు 299 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఇదే మొదటిసారి. 1988-89 సీజన్‌లో మహారాష్ట్ర ఆటగాడు శంతాను సుగ్వేకర్‌ 299 పరుగుల వద్ద అజేయంగా మిగిలిపోయాడు. యావత్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఘరామీతో సహా ఇప్పటివరకు కేవలం ముగ్గురే 299 పరుగుల వద్ద ఔటయ్యారు. 

ఈ ఇన్నింగ్స్‌లో ఘరామీ 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 299 పరుగులు చేశాడు. వనడౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఆరో వికెట్‌కు సుమంత్‌ గుప్తాతో (81) 165 పరుగులు, ఏడో వికెట్‌కు హబీబ్‌ గాంధీతో (95) 221 పరుగుల భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 

ఘరామీ బ్యాట్‌ నుంచి జాలువారిన ఈ మారథాన్‌ ఇన్నింగ్స్‌ ఆధునిక రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌ల్లో (12 గంటలకు పైబడి) ఒకటిగా నిలిచిపోతుంది. ఈ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌తో బెంగాల్‌ను ఒంటిచేత్తో గట్టెక్కించిన ఘరామీ, ఒక్క పరుగు తేడాతో అరుదైన ట్రిపుల్‌ సెంచరీ మిస్సై నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. 

ఘరామీ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ కారణంగా ఆంధ్రతో మ్యాచ్‌లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 629 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ఆఖర్లో టీమిండియా ఆటగాడు, బెంగాల్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ (53) కూడా మెరుపు అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు.

దీనికి ముందు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఇన్నింగ్స్‌లో రికీ భుయ్‌ (83) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. శ్రీకర్‌ భరత్‌ (47), షేక్‌ రషీద్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (33) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. 

టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో విజృంభించగా.. మరో టీమిండియా బౌలర్‌, బెంగాల్‌ పేసర్‌ ఆకాశ్‌దీప్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. షమీ సైతం ఓ వికెట్‌ పడగొట్టాడు.

ప్రస్తుతం ఆట చివరి రోజు మూడో సెషన్‌ కొనసాగుతుంది. ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. కెప్టెన్‌ రికీ భుయ్‌ (1), నితీశ్‌ కుమార్‌ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌  స్కోర్‌కు ఆంధ్ర ఇంకా 289 పరుగులు వెనుకపడి ఉంది. ఈ మ్యాచ్‌ ఎటూ డ్రా అవుతుంది కాబట్టి, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కారణంగా బెంగాల్‌ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)