‘ప్రతిసారి దూకుడు పనికిరాదు.. సూపర్‌ ఫిట్‌గా ఉండాలి’

Published on Mon, 08/26/2024 - 20:23

భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ఇటీవల పారిస్‌ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల ఈ షట్లర్‌ కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) సర్క్యూట్‌లో ఆడటానికి ముందు అత్యుత్తమ ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఆదివారం ఆస్ట్రియా బయలుదేరాడు. 

ఈ నేపథ్యంలో లక్ష్య కోచ్‌ విమల్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బలాబలాలు అంచనా వేసుకునేందుకు, సానుకూలతలు పెంచుకునేందుకు ఈ పర్యటన లక్ష్య సేన్‌కు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం లక్ష్యసేన్‌ పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడు. కానీ అతడికి మరింత శారీరక శిక్షణ అవసరం. స్ట్రెంత్‌ అండ్‌ కండీషనింగ్‌పై దృష్టి పెట్టాలి. అందుకే లక్ష్య వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటాడు. 

ఫిట్‌నెస్‌ను మరింత మెరుగు పరుచుకోవడంతో పాటు... అతడి ఆటలో వేగం పెంచుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడనుంది. సాధారణంగా లక్ష్య ఆటతీరు దూకుడుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు డిఫెన్స్‌ కూడా ముఖ్యమే. నెట్‌ గేమ్‌పై పట్టు సాధించాలంటే సూపర్‌ ఫిట్‌గా ఉండాలి’అని విమల్‌ పేర్కొన్నాడు. వచ్చే నెలలో హాంకాంగ్‌ సూపర్‌–500, చైనా ఓపెన్‌ సూపర్‌–1000 టోరీ్నల్లో లక్ష్యసేన్‌ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)