Breaking News

తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం.. ఒక్కసారిగా డబ్బు రాగానే..

Published on Sat, 12/07/2024 - 18:21

క్రికెట్‌ వర్గాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పృథ్వీ షా. ఒకప్పుడు సచిన్‌ టెండుల్కర్‌ వారసుడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబైకర్‌.. ఇప్పుడు కెరీర్‌లో చాలా వెనుకబడిపోయాడు. ఐపీఎల్‌ మెగా వేలం-2025లో రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చినా.. ఒక్క ఫ్రాంఛైజీ కూడా అతడిని పట్టించుకోలేదు.

ఫలితంగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు పృథ్వీ. ఇందుకు ప్రధాన కారణం ఫిట్‌నెస్‌ లేమితో పాటు క్రమశిక్షణా రాహిత్యమనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంత మంది మాజీ క్రికెటర్లు పృథ్వీ షాకు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు మాత్రం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని.. కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఘాటుగానే విమర్శిస్తున్నారు.

తల్లి లేదు.. తండ్రికి వ్యాపారంలో నష్టం..
ఈ నేపథ్యంలో పృథ్వీ షా చిన్ననాటి కోచ్‌ రాజు పాఠక్‌.. ఈ బ్యాటర్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియని కొన్ని విషయాలు బయటపెట్టాడు. ‘‘వాళ్ల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఏం ఉండేది కాదు. అతడి తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలపాలయ్యారు. అందువల్ల షా చిన్నప్పటి నుంచి ఇతరుల సాయంపై ఆధారపడేవాడు.

అలా ప్రతిదానికి ఇతరుల వద్ద చేయి చాచినట్లుగా ఉండటం మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇక అతడికి తల్లి కూడా లేదు. అతడు అంతగా పరిణతి చెందక ముందే ఆమె కన్నుమూసింది. ఎవరికైనా తల్లి ఉంటేనే కదా.. తప్పొప్పుల గురించి సరిగ్గా తెలుస్తుంది. 



ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే
ఎన్ని కష్టాలు ఉన్నా.. ఆటపై దృష్టి పెట్టి చిన్న వయసులోనే విజయవంతమైన క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. చిన్నపుడు డబ్బుల్లేక పేదరికంలో మగ్గిన ఓ కుర్రాడు.. ఒక్కసారిగా అకౌంట్లో లెక్కకు మిక్కిలి డబ్బులు పడగానే మారిపోవడం సహజం.

అతడు కూడా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకున్నాడు. దాదాపుగా అందరూ ఇదే పని చేస్తారు. తమకు నచ్చినట్లుగా జీవించాలని భావిస్తారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు కారణంగా కొంతమంది విలాసాలకు అలవాటు పడతారు. 

పృథ్వీ షా  25 ఏళ్ల కుర్రాడు
అయినా పృథ్వీ షా కేవలం 25 ఏళ్ల కుర్రాడు. అతడిని 40 ఏళ్ల, పరిణతి చెందిన మనిషిగా ఉండాలని కోరుకోవడం వల్లే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి’’ అని రాజు పాఠక్‌ పృథ్వీ షాను విమర్శించే వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియాలో చోటు కరువు
కాగా 2018లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన పృథ్వీ షా తొలి టెస్టులోనే శతకంతో మెరిశాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా జట్టులో పాతుకుపోతాడని భావించగా.. శుభ్‌మన్‌ గిల్‌తో పోటీలో వెనుకబడి జట్టుకు దూరమయ్యాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున పృథ్వీ షా ఐదు టెస్టులు, ఆరు వన్డేలు.. ఆయా ఫార్మాట్లలో 339, 189 పరుగులు చేశాడు.

ఒకే ఒక్క టీ20 ఆడినప్పటికీ పరుగుల ఖాతా తెరవలేదు. ఇక గత వేలం సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పృథ్వీని ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోవడంతో ఈసారి వేలానికి ముందే రిలీజ్‌ చేసింది. ఇక ఐపీఎల్‌ కెరీర్‌లో పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్‌లు ఆడి 1892 రన్స్‌ సాధించాడు.

చదవండి: ఒకప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడిలా! కాంబ్లీని ఆదుకుంటామన్న టీమిండియా లెజెండ్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)