T20 WC: బతిమిలాడుతున్నా వినడం లేదు.. ఇక వాళ్లదే భారం!

Published on Wed, 04/17/2024 - 12:43

ఐపీఎల్‌ 2024.. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 276.. పడగొట్టిన వికెట్లు ఏడు(7/165).. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సునిల్‌ నరైన్‌ నమోదు చేసిన గణాంకాలివి.

రాజస్తాన్‌ రాయల్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో 35 ఏళ్ల ఈ వెస్టిండీస్‌ ఆటగాడు కుర్రాళ్ల కళ్లు చెదిరే రీతిలో అద్బుతమైన షాట్లతో అలరించాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. 

ఓపెనర్‌గా ఇరగదీస్తున్నాడు
విధ్వంసకర శతకంతో విరుచుకుపడి తన ఆటలో పస తగ్గలేదని మరోసారి నిరూపించాడు. కేకేఆర్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌. 

కేవలం పరుగుల తీయడానికే పరిమితం కాని ఈ రైటార్మ్‌ స్పిన్నర్‌.. రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఓ క్యాచ్‌ కూడా అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు క్యాచ్‌, వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.  

12 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నా
ఇక ఈ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ ప్రతిభకు వెస్టిండీస్‌ కెప్టెన్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ హిట్టర్‌ రోవ్‌మన్‌ పావెల్‌ కూడా ఫిదా అయ్యాడు. నరైన్‌ను ఎలాగైనా ఒప్పించి ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడించే ప్రయత్నం చేస్తామంటున్నాడు.

కేకేఆర్‌పై రాజస్తాన్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించిన పావెల్‌ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘గత 12 నెలలుగా నేను నరైన్‌ చెవిలో జోరీగలా మొత్తుకుంటూనే ఉన్నాను. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకోమని అడుగుతున్నాను.

కానీ అతడు ఏదో దాస్తున్నాడు. ఎవరితోనూ తన మనసులోని భావాలు పంచుకోవడం లేదు. ఈ విషయం గురించి ఇప్పటికే కీరన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రావో, నికోలస్‌ పూరన్‌లతో చర్చించాను.ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కంటే ముందే వీళ్లు అతడి మనసులో ఏముందో కనిపెట్టగలరనే అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. 

విండీస్‌లో ఈసారి వరల్డ్‌కప్‌
జూన్‌ 1 నుంచి వెస్టిండీస్‌- అమెరికా వేదికగా మొదలుకానున్న టీ20 ప్రపంచకప్‌-2024లో సునిల్‌ నరైన్‌ ఆడించడమే తన లక్ష్యమని రోవ్‌మన్‌ పావెల్‌ ఈ సందర్భంగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో చెప్పుకొచ్చాడు.

ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో పావెల్‌ 13 బంతుల్లో 26 పరుగులు చేసి నరైన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న నరైన్‌.. మరో 20 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 

2023లో రిటైర్‌ అయిన నరైన్‌
2012, 2014 టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో వెస్టిండీస్‌ తరఫున బరిలోకి దిగిన సునిల్‌ నరైన్‌.. 2019 నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో.. 2023లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఫ్రాంఛైజీ క్రికెట్‌లో మాత్రం ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు.

చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్‌, అగార్కర్‌ చర్చలు.. హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌!

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)