Breaking News

మాథ్యూస్‌, స్కివర్‌ విధ్వంసం.. గుజరాత్‌ టార్గెట్‌ ఎంతంటే?

Published on Thu, 03/13/2025 - 21:20

డ‌బ్ల్యూపీఎల్‌-2025లో ముంబై వేదిక‌గా గుజ‌రాత్ జెయింట్స్‌తో జ‌రుగుతున్న ఎలిమినేట‌ర్‌లో ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్‌(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), నాట్‌ స్కివర్‌ బ్రాంట్‌(41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) అద్బుతమైన హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ గుజరాత్‌ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్‌ ద్వయంతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది.

గుజరాత్ బౌలర్లలో గిబ్సన్ రెండు, గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఫీల్డర్లు సునాయస క్యాచ్‌లను జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌కు గుజరాత్ స్టార్ ప్లేయర్ డాటిన్ దూరమైంది. డాటిన్ లేని లోటు గుజరాత్ టీమ్‌లో స్పష్టంగా కన్పించింది. 

తుది జట్లు
ముంబై ఇండియన్స్‌: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్‌), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్

గుజరాత్‌​: బెత్ మూనీ (వికెట్ కీపర్‌), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్‌), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, డేనియల్ గిబ్సన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)