Breaking News

కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్న సౌతాఫ్రికా బ్యాటింగ్‌ లెజెండ్‌

Published on Thu, 08/03/2023 - 16:36

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌, బ్యాటింగ్‌ లెజెండ్‌ హషీమ్‌ ఆమ్లా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఈ దిగ్గజ ఓపెనర్‌ జొహనెస్‌బర్గ్‌ బేస్‌డ్‌ ఫ్రాంచైజీ గౌటెంగ్ లయన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. మూడేళ్ల పాటు ఆమ్లా ఈ పదవిలో కొనసాగనున్నాడు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ జేపీ డుమినీ స్థానంలో ఆమ్లా గౌటెంగ్ లయన్స్‌ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఆరంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌ పనిచేసిన ఆమ్లా.. ఈ ఏడాదే ప్లేయర్‌గా చివరిసారిగా మైదానంలో కనిపించాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌లో అతను వరల్డ్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 

దిగ్గజ బ్యాటర్‌గా ఖ్యాతి గడించిన 40 ఏళ్ల ఆమ్లా 2004-19 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడాడు. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లలో 50కు దగ్గరగా సగటు కలిగిన ఆమ్లా.. తన 13 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్‌ 2000, 3000, 4000, 6000, 7000 పరుగుల రికార్డులు ఇప్పటికీ ఆమ్లా ఖాతాలోనే ఉన్నాయి.

కెరీర్‌లో 124 టెస్ట్‌లు ఆడిన ఆమ్లా.. 28 సెంచరీలు, 41 హాఫ్‌ సెంచరీల సాయంతో 46.6 సగటున 9282 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని అత్యుత్తమ స్కోర్‌ 311 నాటౌట్‌గా ఉంది. అలాగే 181 వన్డేలు ఆడిన ఆమ్లా... 27 సెంచరీలు, 39 హాఫ్‌సెంచరీల సాయంతో 49.5 సగటున 8113 పరుగులు చేశాడు.

2009-18 మధ్యలో 44 టీ20 ఆడిన ఆమ్లా.. 8 అర్ధశతకాల సాయంతో 1277 పరుగలు చేశాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటిన ఆమ్లా 2016, 2017 సీజన్లలో 16 మ్యాచ్‌లు ఆడి 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 141.8 స్ట్రయిక్‌రేట్‌తో 577 పరుగులు చేశాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)