Breaking News

హరియాణా పాంచ్‌ పటాకా

Published on Mon, 11/18/2024 - 04:09

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో హరియాణా స్టీలర్స్‌ జట్టు జోరు కొనసాగుతోంది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న హరియాణా స్టీలర్స్‌ లీగ్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లో విజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన హరియాణా స్టీలర్స్‌ 36–29 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది.

స్టీలర్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ వినయ్‌ 10 పాయింట్లతో సత్తా చాటగా... డిఫెన్స్‌లో మొహమ్మద్‌ రెజా (8 పాయింట్లు) ఆకట్టుకున్నాడు. తమిళ్‌ తలైవాస్‌ తరఫున మొయిన్‌ 7 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హరియాణా జట్టు 21 రెయిడ్‌ పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించగా... 12 రెయిడ్‌ పాయింట్లకే పరిమితమై తమిళ్‌ తలైవాస్‌ పరాజయం పాలైంది. 

ఆడిన పది మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 2 పరాజయాలు సాధించిన హరియాణా స్టీలర్స్‌ 41 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మరోవైపు 11 మ్యాచ్‌లాడి 4 విజయాలు, 6 పరాజయాలు ఒక ‘టై’తో 28 పాయింట్లు సాధించిన తమిళ్‌ తలైవాస్‌ జట్టు పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.  

పుణేరి పల్టన్‌పై జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ గెలుపు 
మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 30–28 పరుగుల తేడాతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. జైపూర్‌ జట్టు తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 8 పాయింట్లు, అంకుశ్‌ 6 పాయింట్లతో రాణించారు. పుణేరి పల్టన్‌ తరఫున ఆకాశ్‌ షిండే 7 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. 

మ్యాచ్‌ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో జైపూర్‌ జట్టు కీలక సమయంలో ఆధిక్యం చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో 12 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... ట్యాకెలింగ్‌లో జైపూర్‌ 14 పాయింట్లు, పుణేరి పల్టన్‌ 10 పాయింట్లు సాధించాయి. 

తాజా సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 5 విజయాలు, 3 పరాజయాలు, ఒక ‘టై’తో 30 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు 9 మ్యాచ్‌లాడిన పుణేరి పల్టన్‌ 5 విజయాలు, 2 ఓటములు, 2 ‘టై’లతో 33 పాయింట్లు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో హరియాణా స్టీలర్స్‌ (రాత్రి 8 గంటలకు), బెంగళూరు బుల్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)