Breaking News

హరియాణా ‘టాప్‌’ షో

Published on Thu, 11/28/2024 - 04:21

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో హరియాణా స్టీలర్స్‌ జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న స్టీలర్స్‌ బుధవారం జరిగిన పోరులో 38–28 పాయింట్ల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ పుణేరి పల్టన్‌పై విజయం సాధించింది. లీగ్‌లో హరియాణాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. మ్యాచ్‌ ఆరంభంలోనే ఐదు పాయింట్లు సాధించిన హరియాణా అదే జోరులో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 

తొలి అర్ధభాగం ముగిసేసరికి 22–14తో నిలిచిన స్టీలర్స్‌... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ద్వితీయార్ధంలోనూ చెలరేగి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టీలర్స్‌ జట్టు అటు రెయిడింగ్‌తో పాటు ఇటు డిఫెన్స్‌లో ఆకట్టుకుంటే... కేవలం రెయిడింగ్‌నే నమ్ముకున్న పల్టన్‌కు పరాజయం తప్పలేదు. స్టీలర్స్‌ తరఫున శివమ్‌ 13 పాయింట్లు సాధించగా... పుణేరి పల్టన్‌ తరఫున పంకజ్‌ 11 పాయింట్లతో పోరాడాడు. 

లీగ్‌లో 14 హోయ్చ్‌లు ఆడిన హరియాణా స్టీలర్స్‌ 11 విజయాలు, 3 పరాజయాలతో 56 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... పుణేరి పల్టన్‌ 14 మ్యాచ్‌లాడి 6 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘టై’లతో 42 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో  గుజరాత్‌ జెయింట్స్‌ 39–37 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందింది. 

గుజరాత్‌ తరఫున గుమన్‌ సింగ్‌ 12 పాయింట్లతో సత్తా చాటగా... వారియర్స్‌ తరఫున మణిందర్‌ 11 పాయింట్లతో రాణించాడు.  నేడు జరిగే  మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తెలుగు టైటాన్స్‌ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)