Breaking News

హర్యానా స్టీలర్స్‌ ఆరో విజయం

Published on Sun, 09/21/2025 - 04:25

జైపూర్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 12వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్‌ ఆరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో హర్యానా స్టీలర్స్‌ 38–36 పాయింట్ల తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. స్టీలర్స్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. హర్యానా స్టీలర్స్‌ తరఫున శివమ్‌ 9 పాయింట్లు, వినయ్‌ 7 పాయింట్లతో సత్తాచాటగా... తమిళ్‌ తలైవాస్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హర్యానా 20 రెయిడ్‌ పాయింట్లు సాధించగా... తలైవాస్‌ 22 పాయింట్లు సాధించింది. 

ట్యాక్లింగ్‌లో ఇరు జట్లు తొమ్మిదేసి పాయింట్లు సాధించాయి. అయితే ఎక్స్‌ట్రా పాయింట్లలో ముందున్న హర్యానా గెలుపొందింది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన స్టీలర్స్‌ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక మూడో స్థానానికి చేరింది.  మరో మ్యాచ్‌లో పట్నా పైరెట్స్‌ 33–30 పాయింట్ల తేడాతో దబంగ్‌ ఢిల్లీపై విజయం సాధించింది. సీజన్‌ ఆరంభం నుంచి ఓటమి ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్‌ ఢిల్లీకి ఆరు విజయాల తర్వాత ఇదే తొలి పరాజయం. 

పట్నా తరఫున సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ అంకిత్‌ రాణా 12 పాయింట్లతో విజృంభించాడు. అంకిత్‌ జగ్లాన్‌ 6, అయాన్‌ 5 పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. దబంగ్‌ ఢిల్లీ తరఫున నీరజ్‌ నర్వాల్‌ 8, అషు మాలిక్‌ 6 పాయింట్లు సాధించారు. తాజా సీన్‌లో పట్నా పైరెట్స్‌ 7 మ్యాచ్‌లాడి 2 విజయాలు, 5 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక తొమ్మిదో స్థానంలో నిలిచింది. 

మరోవైపు ఢిల్లీ 7 మ్యాచ్‌లాడి 6 విజయాలు, ఒక పరాజయంతో 12 పాయింట్లతో పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో ఆదివారం విశ్రాంతి దినం కాగా... సోమవారం గుజరాత్‌ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్, తమిళ్‌ తలైవాస్‌తో యూపీ యోధాస్‌ తలపడతాయి.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)